ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన అన్ని విధాలుగా విజయవంతమైందన్నారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ.అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన తొలి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు.
సెప్టెంబర్ 29న ఇండో అమెరికన్ కమ్యూనిటీతో జరిగిన విందు కార్యక్రమం సందర్భంగా సంధూ ఈ వ్యాఖ్యలు చేశారు.మార్చి 2020లో వెలుగు చూసిన కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ఈ స్థాయిలో వాషింగ్టన్‌లో విందులో పాల్గొనడం ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా తరంజిత్ సింగ్ మాట్లాడుతూ.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో బైడెన్-హారిస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ వీరితో సమావేశమవ్వడం ఇదే తొలిసారి.గతంలో 2014 నుంచి 2016లో బైడెన్ దేశ ఉపాధ్యక్షుడిగా వున్న మోడీ ఆయనతో భేటీ అయ్యారు.
అందువల్ల మోడీ-బైడెన్ కలయిక ఇదే తొలిసారి కాదని సంధూ వెల్లడించారు.అధ్యక్షుడితో సమావేశం చాలా బాగుందని ప్రధాని అన్నట్లుగా సంధూ వివరించారు.

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సైతం చర్చలు స్పూర్తివంతంగా సాగాయని తరంజిత్ అన్నారు.అలాగే బైడెన్ అధ్యక్షతన జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో జపాన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులతో మోడీ పలు అంశాలపై చర్చించారని సంధూ పేర్కొన్నారు.ప్రధానంగా కరోనా టీకాలకు సంబంధించి నాలుగు దేశాలూ తమ బలాలను ఒకేచోట కేంద్రీకరీంచుకుంటున్నాయని చెప్పారు.భారత్ విషాయానికి వస్తే 2022లో ఒక బిలియన్ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నామని సంధు వెల్లడించారు.
ఇండో ఫసిఫిక్‌లో ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలలో వీటిని పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.
అలాగే వాషింగ్టన్‌లో వున్నప్పుడే ప్రధాని మోడీ.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో మరో రెండు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారని సంధూ వెల్లడించారు.ఇక ఈ పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం.
భారత్‌కు 150 చారిత్రాత్మక, పురాతన వస్తువులను అప్పగించిందన్నారు.వీటిని ప్రధాని మోడీ ఇండియాకు తీసుకెళ్లారని తరంజిత్ సింగ్ చెప్పారు.