ప్రధాని మోడీ పుట్టినరోజు స్పెషల్... పులి విమానంలో చిరుతలు....

మన దేశ ప్రధాని మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న టైగర్ విమానంలో 8 చిరుత పులులు మన దేశానికి రానున్నాయి.ఈ చిరుతపులులను తీసుకురావడానికి మన టైగర్ విమానం ఇప్పటికే నమీబియా బయలుదేరింది.

 Pm Modi's Birthday Special Cheetahs In Tiger Flight, Pm Modi, Namibia, Tiger F-TeluguStop.com

ఈ భారీ పరిమాణంతో ఉన్న విమానం ముందు భాగం పై టైగర్ మొఖం ఫోటో ఉంటుంది.అందుకే ఈ విమానాన్ని టైగర్ విమానం అని అంటారు.

చూడడానికి ఎంతో అందంగా ఉన్నా ఈ టైగర్ విమానం ఫోటో లను నమీబియాలోని భారత కార్యాలయం ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.చిరుతపులులను భారత్ కి తీసుకో వెళ్లడానికి టైగర్ విమానం నమీబియా రాజధాని విండ్‌హోక్‌ కి వచ్చిందని అక్కడ ఉన్న భారత కార్యాలయం తెలిపింది.

భారత కార్యాలయం షేర్ చేసిన టైగర్ విమానం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మన దేశంలో అంతరించిపోతున్న వన్య జంతువుల జాబితాలో చిరుత పులులు కూడా ఉన్నాయి.1970 నుంచి మన దేశం ఇతర దేశాల నుంచి చిరుతపులులను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.అయినా ఇప్పటివరకు ఫలితం లేకుండా పోయింది.

ఈ సంవత్సరం జూలైలో నమీబియాతో చిరుతల పులులను మన దేశానికి తీసుకొని రావడానికి మన దేశం ఒప్పందం చేసుకుంది.చిరుతపులను మన దేశానికి తేవడానికి ఒక భారీ విమానం లో 16 గంటలు ఎక్కడ ఆగకుండా ప్రయాణించాల్సి వస్తుంది.

Telugu Namibia, Pm Modi, Pmmodis, Tiger, Tiger Plane-National News

చిరుతపులులకు ఆ 16 గంటల పాటు ఎటువంటి ఆహారం ఇవ్వకుండా తీసుకొని వస్తారు.ఆ విమానంలో చిరుతల కోసం బోనులు ఏర్పాటు చేసి ఉంచారు.సెప్టెంబర్ 17 వ తేదీ టైగర్ విమానం మనదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ల్యాండ్ అయిన తర్వాత మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లో ప్రధానమంత్రి చేతులమీదుగా ఈ చిరుతలను విడుదల చేస్తారు.ఈ చిరుతలలో ఐదు మగవి, మూడు ఆడవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube