తమిళ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా గాడ్ ఫాదర్ ని డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూశాక మరో స్టార్ హీరో కింగ్ నాగార్జున కూడా మోహన్ రాజాకి ఒక ఛాన్స్ ఇస్తున్నాడని తెలుస్తుంది.
అంతేకాదు నాగార్జున ల్యాండ్ మార్క్ మూవీ 100వ సినిమా మోహన్ రాజా చేతిలో పెడుతున్నట్టు టాక్.అయితే మోహన్ రాజా కథ ఓకే చేసినా గాడ్ ఫాదర్ హిట్ పడితేనే ఆ ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు.
</br<
ఆచార్యతో డీలా పడ్డారు మెగాస్టార్ చిరంజీవి.అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలో మోహన్ రాజా గాడ్ ఫాదర్ హిట్ పడితే ఆ డైరక్టర్ కి వరుస ఛాన్సులు వస్తాయి.మరి నాగార్జునతో మోహన్ రాజా సినిమా ఉంటుందా లేదా అన్నది గాడ్ ఫాదర్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
గాడ్ ఫాదర్ అనుకున్న రేంజ్ హిట్టు కొడితే మాత్రం మోహన్ రాజాకి తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటించిన విషయం తెలిసిందే.







