భారత ప్రధాని మోడీ డ్రెస్( PM Narendra Modi Dress ) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అయితే ఇది కొత్తేమి కాదని అనుకుంటున్నారా? అవును, మోడీ డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? నరేంద్ర మోడీ అంతర్జాతీయ వేదికపై మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచి, హాట్ టాపిక్ అయ్యారు.విషయం ఏమంటే, ఆదివారం జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగిన జీ7 సమ్మిట్( G7 Summit )లో పాల్గొన్న ప్రధాని మోదీ రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించగా ఇపుడు టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది.
కాగా, ఈ జాకెట్‌ను ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్( Recycled Plastic Bottles ) చేయగా వచ్చిన మెటీరియల్‌తో తయారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇలాంటి జాకెట్లను ధరించి ప్రధాని మోడీ గతంలో కూడా హాట్ టాపిక్ అయ్యారు.గతంలో బెంగళూరులో ఓ సమావేశానికి, ఓసారి పార్లమెంట్‌కు వచ్చిన సందర్భంలో ఓ జాకెట్ ధరించారు.
తాజాగా అంతర్జాతీయ వేదికపై ఇలాంటి జాకెట్ ధరించడం అందరినీ ఆకట్టుకుంది.పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకే మోడీ ఈ జాకెట్ ధరించడం విశేషం.
దీంతో, మరోసారి మోడీ డ్రెస్సింగ్ స్టైల్ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది.ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దాంతో చాలామంది నెటిజన్లు మోడీజీ డ్రెస్ ని తెగ కొనియాడుతున్నారు.మరీ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పడానికి సాక్షాత్తు దేశ ప్రధాని ప్రతిన బూనడం చాలామందికి గర్వంగానూ, అనేకమందికి ఆదర్శంగాను అనిపిస్తున్నది.
ఈ విషయమై వివిధ దేశాలవారు మోడీజీని తమ కామెంట్లతో ఆకాశానికెత్తేస్తున్నారు.