కావాలని చేశారో.మరి ఎందుకు చేశారోగానీ.
ఈ ఆకతాయిలు ఎంతటి ఘనులంటే.ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టేశారట.
అక్కడ ఇక్కడ కాదు.అది కూడా ఓఎల్ఎక్స్‌లోనే ఏకంగా రూ.7.5 కోట్లకు అమ్మకానికి పెట్టినట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందిందట.ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో చోటుచేసుకుంది.
వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పీఎం మోడీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అక్కడే గురుధామ్ కాలనీలో ప్రధాని కార్యాలయం ఉన్నట్లు, అదికూడా 6500 చదరపు అడుగుల ఏరియాలో ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు.4 గదులు, 4 బాత్రూంలతో ఈ కార్యాలయం ఉన్నట్లు వారు ప్రకటనలో తెలిపారు.ఈ ప్రకటనపై పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి రావడంతో పాటు పోలీసులు ఈ ప్రకటనపై షాకయ్యారట.

కార్యాలయం అమ్మకానికి ఉన్నట్లు క్లాసిఫైడ్స్ వెబ్‌సైట్ ఓల్ఎక్స్‌లో ప్రచురితమైన ప్రకటనపై ఫిర్యాదు రావడంతో బాధ్యులైన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది.ఆ ప్రకటనలో ప్రధాని కార్యాలయం ఫోటో, కార్యాలయం వివరాలను కూడా పెట్టినారట.అయితే ఈ వివరాలతో ఉన్న ఫోటోను తొలగించి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ప్రకటనను ఇచ్చింది లక్ష్మీకాంత్ ఓఝా అని వారణాసి పోలీస్ అధికారి అమిత్‌కుమార్ పాఠక్ పేర్కొన్నారు.అసలు ఆ నలుగురు వ్యక్తులు అలా ఎందుకు చేశారో అనేదానిపై వారణాసి పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.