ఒకే పాటను ఐదు భాషల్లో కలిపి పాడి ఆశ్చర్యపరిచిన సిక్కు వ్యక్తి.. మోదీ ఫిదా..

PM Modi Praised Punjab Man Singing Kesariya Song In 5 Languages Details, Viral Video, Viral News, Singing Talent, Latest News, Punjabi Singer, Kesariya Song, Brahmastra Movie , Snehdeep Singh Kalsi, PM Narendra Modi, Anand Mahindra

సోషల్ మీడియా పుణ్యమా అని చాలామందిలో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది.తాజాగా ఒక వ్యక్తి సింగింగ్ లో( Singing ) ఒక అమేజింగ్ టాలెంట్ చూపించాడు.

 Pm Modi Praised Punjab Man Singing Kesariya Song In 5 Languages Details, Viral V-TeluguStop.com

సిక్కు వ్యక్తి ఒకేసారి ఐదు భాషల్లో పాటను అద్భుతంగా ఆలపించి అబ్బురపరిచాడు.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా ప్రత్యక్షమైంది అప్పటినుంచి అది విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోకి ఇప్పటికే ఆరు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియోలో పంజాబీ వ్యక్తి బ్రహ్మాస్త్ర సినిమాలోని కేసరియా పాటను( Kesariay song ) పాడటం వినవచ్చు.

పాటను అతడు ఐదు విభాగాలుగా చేసి ఆ పార్ట్స్‌ను ఐదు డిఫరెంట్ లాంగ్వేజస్‌లో కలిపి పాడాడు.‘బ్రహ్మాస్త్ర’ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన సంగతి విధితమే.

అయితే ఆ అన్ని భాషలలోనూ కేసరియా పాట సూపర్ హిట్ అయింది.కాగా ఇదే పాటను ఈ సిక్కు వ్యక్తి మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కలిపి పాడాడు.

అతడి వాయిస్ చాలా మెలోడీస్ గా ఉంది.అలాగే తెలుగు పదాలను కూడా అతను ఎంతో స్పష్టంగా పలికాడు.సుమారు ఒక నిమిషం అతడు అద్భుతమైన గాత్రంతో మ్యాజిక్ చేశాడు.దాంతో నెటిజనులందరూ ఆ వీడియో చూస్తూ మైమరిచిపోయారు.చివరికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను సైతం అతడు టాలెంట్ చేసి ఫిదా అయిపోయాడు.ఎవరూ బ్రేక్ చేయలేని గొప్ప టాలెంట్ ఇది అని కూడా కామెంట్ చేశారు.

అలాగే ఈ పాట వింటుంటే విడదీయలేని భారతీయ భాషలు శబ్దాలు లాగా అనిపిస్తోందని అన్నారు.ఇంతకీ ఈ పాట పాడిన వ్యక్తి పేరు స్నేహదీప్ సింగ్ కల్సి.( Snehdeep Singh Kalsi ) ఈ టాలెంటెడ్ సింగర్ ముంబైలో ఉంటాడు.”ప్రతిభావంతులైన స్నేహదీప్ సింగ్ ద్వారా ఈ అద్భుతమైన ప్రదర్శనను చూశాను.ఇది చాలా మెలోడీగా ఉంది. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ఇది గొప్ప ఉదాహరణ” అని భారత ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) ట్విట్టర్ ద్వారా కూడా ఈ సింగింగ్ పై కామెంట్లు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube