దానిమ్మ పండ్ల సాగులో నాణ్యమైన అధిక దిగుబడి కోసం సరైన సస్యరక్షక పద్ధతులు..!

ప్రధానంగా పండించే వాణిజ్య పంటలలో దానిమ్మ పంట( Pomegranate )కు ప్రత్యేక స్థానం ఉంది.ఇందులో ఔషక విలువలు చాలా ఎక్కువ.

 Pomegranate Cultivation Methods Tips, Pomegranate, Pomegranate Farming, Pomegran-TeluguStop.com

కాబట్టి ఆయుర్వేద మందుల తయారీలో దానిమ్మ పండ్ల రసం, ఆకులు, వేర్లను ఎక్కువగా వినియోగిస్తారు.తెలుగు రాష్ట్రాలలో ఉండే ఎటువంటి నేలలోనైనా ఈ దానిమ్మ సాగు చేయవచ్చు.

నేలలో తేమశాతం అధికంగా ఉన్న, చాలా తక్కువగా ఉన్న సాగు చేయవచ్చు.సారవంతం కానీ నేలలోనైనా, మురికి నీరు ప్రవహించే నేలల్లోనైనా సాగు చేయవచ్చు.

కాకపోతే 60 సెం.మీ లోతున్న భూములలో అయితే అధిక దిగుబడి సాధించవచ్చు.

Telugu Agriculture, Pomegranate-Latest News - Telugu

దానిమ్మ సాగుకు అనువైన రకాల విషయానికి వస్తే.రూబీ, కాంధారి, జ్యోతి, మృదుల, భగవ, పూలే అరక్త లాంటివి అనుకూలంగా ఉండి, మంచి దిగుబడి ఇస్తాయి.నాణ్యమైన కాయల దిగుబడి కోసం నీటిలో తేమశాతం ఎప్పుడూ ఒకేలా ఉండే విధంగా జాగ్రత్తపడాలి.డ్రిప్ విధానం ద్వారా మార్చి నుండి జూలై వరకు నీటి ఎద్దడి సమస్య తెలత్తకుండా తడులు ఇవ్వాలి.0.5 మిల్లి మోల్స్ సెం.మీ విద్యుత్ వాహకత గల ఉప్పునీరు పంటకు అందించాలి.

దానిమ్మ సాగు( Pomegranate Cultivation )లో అతి కీలకమైనది సరైన సమయంలో కత్తిరింపులు చేయడం.

ప్రతి మొక్కలో బలంగా పెరిగిన నాలుగైదు కొమ్మలను ఉంచి, మిగిలిన కొమ్మలను కత్తిరించాలి.ఇలా రెండు మూడు సంవత్సరాల లో రెండు, మూడు దశలు కొమ్ములను కత్తిరించాలి.

ప్రతి చెట్టు పై 70 నుండి 80 కాయలు ఉంచి మిగిలిన కాయలను తీసివేయడం వల్ల కాయ నాణ్యత, సైజు పెరుగుతుంది.

Telugu Agriculture, Pomegranate-Latest News - Telugu

దానిమ్మ పంటకు ఏడాది పొడవునా పూత వచ్చే గుణం ఉంటుంది, కాబట్టి జూన్ నెల నుండి నీటి తడులు ఆపితే మొక్కలు ఆకులు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తాయి.ఆ సమయంలో మొక్కలకు కత్తిరింపులు చేసి, ఎరువులు అందించాలి.తరువాత నీటి తడులు ఇవ్వడం ప్రారంభిస్తే మొక్కలన్ని ఒకేసారి సెప్టెంబర్ అక్టోబర్ నెల మధ్యలో పూతకు వస్తాయి.

పంట ఫిబ్రవరి- మార్చి నెలలో కోతకు రెడీ అవుతుంది.ఈ సమయంలో వచ్చే కాయల సైజు నాణ్యత మెరుగుగా ఉండడంతో మంచి దిగుబడి పొంది, ఆశించిన స్థాయిలో లాభం అర్జించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube