ఒకే పాటను ఐదు భాషల్లో కలిపి పాడి ఆశ్చర్యపరిచిన సిక్కు వ్యక్తి.. మోదీ ఫిదా..

సోషల్ మీడియా పుణ్యమా అని చాలామందిలో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

తాజాగా ఒక వ్యక్తి సింగింగ్ లో( Singing ) ఒక అమేజింగ్ టాలెంట్ చూపించాడు.

ఈ సిక్కు వ్యక్తి ఒకేసారి ఐదు భాషల్లో పాటను అద్భుతంగా ఆలపించి అబ్బురపరిచాడు.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా ప్రత్యక్షమైంది అప్పటినుంచి అది విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోకి ఇప్పటికే ఆరు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియోలో పంజాబీ వ్యక్తి బ్రహ్మాస్త్ర సినిమాలోని కేసరియా పాటను( Kesariay Song ) పాడటం వినవచ్చు.

పాటను అతడు ఐదు విభాగాలుగా చేసి ఆ పార్ట్స్‌ను ఐదు డిఫరెంట్ లాంగ్వేజస్‌లో కలిపి పాడాడు.

‘బ్రహ్మాస్త్ర’ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన సంగతి విధితమే.

అయితే ఆ అన్ని భాషలలోనూ కేసరియా పాట సూపర్ హిట్ అయింది.కాగా ఇదే పాటను ఈ సిక్కు వ్యక్తి మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కలిపి పాడాడు.

"""/" / అతడి వాయిస్ చాలా మెలోడీస్ గా ఉంది.అలాగే తెలుగు పదాలను కూడా అతను ఎంతో స్పష్టంగా పలికాడు.

సుమారు ఒక నిమిషం అతడు అద్భుతమైన గాత్రంతో మ్యాజిక్ చేశాడు.దాంతో నెటిజనులందరూ ఆ వీడియో చూస్తూ మైమరిచిపోయారు.

చివరికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను సైతం అతడు టాలెంట్ చేసి ఫిదా అయిపోయాడు.

ఎవరూ బ్రేక్ చేయలేని గొప్ప టాలెంట్ ఇది అని కూడా కామెంట్ చేశారు.

"""/" / అలాగే ఈ పాట వింటుంటే విడదీయలేని భారతీయ భాషలు శబ్దాలు లాగా అనిపిస్తోందని అన్నారు.

ఇంతకీ ఈ పాట పాడిన వ్యక్తి పేరు స్నేహదీప్ సింగ్ కల్సి.( Snehdeep Singh Kalsi ) ఈ టాలెంటెడ్ సింగర్ ముంబైలో ఉంటాడు.

"ప్రతిభావంతులైన స్నేహదీప్ సింగ్ ద్వారా ఈ అద్భుతమైన ప్రదర్శనను చూశాను.ఇది చాలా మెలోడీగా ఉంది.

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ఇది గొప్ప ఉదాహరణ" అని భారత ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) ట్విట్టర్ ద్వారా కూడా ఈ సింగింగ్ పై కామెంట్లు చేశారు.

Coriander : అమ్మ బాబోయ్‌.. కొత్తిమీర‌ను ప‌చ్చిగా తిన‌డం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?