దేశవ్యాప్తంగా గత కొంత కాలం నుండి రైతులు కేంద్రంపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకురావడంతో.
మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.ఇదే తరుణంలో చాలా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో పోరాటం చేయడం కూడా జరిగింది.
ఈ పరిస్థితిలో ఉంటే తాజాగా ప్రధాని మోడీ ఈరోజు ఉదయం ప్రసంగిస్తూ నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.రాబోయే పార్లమెంటు సమావేశాలలో చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త వ్యవసాయ చట్టాలను కొంతమంది ఆమోదించినప్పటికీ.మరికొంతమంది వ్యతిరేకిస్తున్న తరుణంలో.
ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు మోడీ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రైతాంగానికి క్షమాపణలు కూడా తెలిపారు.
మోడీ ప్రకటనతో రైతు సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త చట్టాలు తీసుకు వచ్చిన నాటి నుండి ఢిల్లీ సరిహద్దుల్లో.
భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.ఇదే తరుణంలో ప్రతిపక్షాలు కూడా రైతులకు అండగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంపై బంద్.
నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉండటంతో.పాటు అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయంపై మోడీ ప్రభుత్వంపై కొంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి మీడియాలో నెలకొనడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు మోడీ ప్రకటించడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.