వరి పంటలో సుడిదోమ నివారణకు సస్యరక్షక పద్ధతులు..!

భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో వరి పంట( Rice crop ) అగ్రస్థానంలో ఉంది.

అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరి పంటకు వివిధ రకాల చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.

చాలా చోట్ల వరి పైరు చిరు పొట్ట దశలో ఉంది.ఈ దశలో వరి పంటను సుడిదోమ ఆశించే అవకాశం చాలా ఎక్కువ.

దీనిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సుడిదోమల( Mosquitoes ) నుండి పంటను రక్షించుకొని అధిక దిగుబడి సాధించవచ్చు.

ఈ సుడిదోమలు వరి దుబ్బల మొదళ్ళ దగ్గర ఆకు తొడిమ లోపలి కణజాలంలో గుడ్లు పెడతాయి.8 నుండి 28 రోజులలో పిల్ల దోమలు పెద్ద దోమలుగా మారతాయి.రెక్కలున్న సుడిదోమలు పిలకలు వేసే దశలో వరి పైరును ఆశిస్తాయి.

Advertisement

ఇవి మూడు లేదా నాలుగు వారాల్లో రెక్కలు లేని దోమల్ని ఉత్పత్తి చేస్తాయి.ఈ సమయంలో సంరక్షక చర్యలు పాటించకపోతే వరి పైరు నాశనం అవుతుంది.

ఈ పురుగుల ఉదృతి అధికంగా ఉంటే వరి కంకి వరకు కూడా ఇవి ఆశించి నష్టం కలిగిస్తాయి.పురుగులు విసర్జించే జిగురు పదార్థం వల్ల గ్రాసిస్టెంట్( Grassistent ) వంటి వైరస్ తెగుళ్లు కూడా వ్యాపిస్తాయి.

ఈ సుడిదోమల నివారణకు చర్యలు: ముఖ్యంగా బయోమందులను( Biomedicine ) విచక్షణ రహితంగా పిచికారి చేయకూడదు.నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడకూడదు.సన్నగింజల రకాలను ఎక్కువగా సాగు చేయరాదు.ఈ సుడిదోమలను ప్రధాన పొలంలో గుర్తించిన తరువాత 1.5 గ్రా ఎనిఫేట్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే 0.5 గ్రా పైమెట్రోజిన్( Pymetrozine ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.పిచికారీ చేసేటప్పుడు పాయలు తీసుకుని మొక్కల మొదళ్ళ భాగంలో పడేలాగా పిచికారి చేసి ఈ సుడిదోమలను అరికట్టితేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.

పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..
Advertisement

తాజా వార్తలు