పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (పీకే), ఏపీ సీఎం జగన్ మధ్య ఉన్న స్నేహం అంతా ఇంతా కాదు.కొన్నేండ్లుగా జగన్‌తో ఒప్పందం చేసుకుని జత కట్టారు.
ఇతర పార్టీల నాయకులతో పీకే జత కట్టిన దాఖలాలు లేవు.అయితే ప్రధాని మోడీ నుంచి నితీష్ కుమార్, మమతా బెనర్జీ దాకా ఇదే సీన్ కనిపిస్తుంది.
అయితే ఒక ఎన్నికలో పీకేను వాడుకుంటే మరోమారు ఆయనను కంటీన్యూ చేయడం అంటే రాజకీయాల్లో వండర్ అనొచ్చు.అలాంటి పీకేను 2019 ఎన్నికలకు ఉపయోగించుకున్న సీఎం జగన్‌క 2024 కు కూడా ఆయనతోనే జతకట్టాలని భావిస్తున్నారట.
అయితే పీకేకు బీజేపీ అంటే అస్సలు పడదు.కేంద్రంలో బీజేపీకి యాంటీగా కూటమి కట్టేయాలనేది పీకే వ్యూహం.
కానీ, జగన్ మాత్రం బీజేపీ పట్ల ఉన్నామా.లేదా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
ఇక విపక్ష కూటమి వైపు దృష్టి సారించరు.అలాంటిది ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్త కుండా ముందుకు సాగగలరా ? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తెలుస్తోంది.సీఎం అయిన తరువాత జగన్ పీకేను పరోక్షంగా వాడుకున్నారు.ఇప్పుడైతే డైరెక్ట్‌గా వేదిక మీదకు పీకేను తీసుకు రావాలని జగన్ భావిస్తున్నారని తెలిసింది.జులైలో నిర్వహించే పార్టీ ప్లీనరీ వేదికగా పీకేను పరిచయం చేయనున్నారని సమాచారం.పేకే సలహాలతో 2024 ఎన్నికల్లో గెలవాలని జగన్ డిసైడ్ అయ్యారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అంటే ఇంకా రెండేండ్ల వ్యవధి ఉంది.ఇప్పటి నుంచే పార్టీని గాడిలో పెట్టకోవాలి.
లేదంటే ప్రజా వ్యతిరేకతకు తోడు విపక్షాల దూకుడుకు నెట్టుకురావడం కష్టతరం అవుతుందనేది టాక్.అందుకే ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహించి జోష్ పెంచాలని జగన్ యోచిస్తున్నారట.
కాగా ప్రభుత్వ లోటు పాట్లను పీకే ద్వారా తెలుసుకుని సరి దిద్దుకుని 2019మాదిరిగా 2024లో బంపర్ మెజార్టీతో గెలవాలని వ్యూహం రచిస్తున్నట్టు తెలిసింది.అందుకే పీకేను వెంట బెట్టుకుని అన్ని చేయాలను కుంటున్నాడట.ఇక పీకే ఏపీ రాజకీయాలపైనే మొత్తం ఫోకస్ పెట్టాడట.విపక్షాల బలాలు, వైసీపీ బలహీనతలు తెలుసు కుంటూ నివేదిక రూపంలో జగన్‌కు అందించనున్నారని సమాచారం. అయితే ఏపీ రాజకీయాల్లో పీకే ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.