కాంగ్రెస్ లో పీకే చేరిక వాయిదా?

కాంగ్రెస్ లో పీకే చేరిక వాయిదాఎన్నికల వ్యూహకర్తగా గొప్పపేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారా? ఆయన ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.కొద్దికాలం పాటు ఈ రాజకీయాలు ఎన్నికల గొడవ నుంచి ఆయన దూరంగా ఉండ పోతున్నట్లు సమాచారం.2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంలో నరేంద్ర మోడీ ప్రధాని కావడం లో కీలక పాత్ర పోషించిన పీకే పేరు ఒక్కసారిగా మార్మోగింది.ఆ తర్వాత వివిధ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయ పార్టీల విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన ఆయన ఎక్కువ శాతం విజయాలు సాధించారు.

 Pk Inclusion In Congress Postponed,soniagandhi,narendramodi,rahul Gandhi,-TeluguStop.com

మోడీ ప్రధాని తట్టుకుని పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తిరిగి గెలిపించడం  అందులో ముఖ్యమైనది.బెంగాల్ ఎన్నికల అనంతరం ఎన్నికలు రాజకీయ క్షేత్రం నుంచి కొంత కాలం విరామం తీసుకుంటానని పీకే ప్రకటించాడు.

కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తారని వార్తలు వినిపించాయి.  అందుకు తగ్గట్టుగానే మోడీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలంటే ఉద్దేశంతో ఉన్న ప్రధాన పార్టీ నేతలతో ఆయన వరుసగా సమావేశమయ్యారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ  అధినాయకుడు శరద్ పవార్ తో చర్చలు జరిపారు.  చివరకు ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.

ఆ మేరకు ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో మాట్లాడారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారని  వార్తలు వచ్చాయి.వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ విజయం కోసం పని చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Telugu Mamatha Benarji, Narendramodi, Pk Congress, Priyanka Gandhi, Rahul Gandhi

ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సలహాదారు కీలకపాత్ర ఆశిస్తున్నారు అనే వఖ్యలు వినిపించాయి.కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీకి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీలో 23 మంది సీనియర్ నేతలు పీకే విషయంపై వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమైంది.దీంతో చేర్చుకునే విషయంపై సోనియాగాంధీ అంతిమ నిర్ణయం తీసుకునే వీలుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ ఇప్పుడు అంచనాలు విశ్లేషణలు ఏవి కూడా వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదని తేలిపోయింది.కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రసారానికి ఆయనకు చెందిన ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐ-ప్యాక్ తెరదించింది.

పీకే కాంగ్రెస్ లో చేరడం లేదని ఏ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం లేదని ఆ కమిటీ స్పష్టం చేసింది.వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన దూరంగా ఉంటారని వెల్లడించింది.

పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత కొద్ది కాలం విరామం తీసుకోవాలని అనుకున్నట్లు ప్రకటించిన ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది కాంగ్రెస్ లోని సీనియర్ నుంచి వ్యతిరేకత రావడంతో పార్టీలో చేర్చుకుని విషయంలో సోనియాగాంధీ సందిగ్ధంలో పడ్డారని అందుకే ఆయన పార్టీలో చేరే అవకాశం లేదని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube