గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు నానా తంటాలు..

మ‌న‌కు సాధార‌ణంగా నేల‌పై ఏదైనా తినే వ‌స్తువు ఉంటేనే దాన్ని తినేందుకు మ‌నం ప‌డే అవ‌స్థ‌లు అన్నీ ఇన్ని కావ‌నే చెప్పాలి.

మ‌రి అలాంటిది గాలిలో ఎగిరే ఆహారాన్ని తినాలంటే ఇంకా ఎంత ఇబ్బంది ప‌డాలో చెప్పండి.

ఊహించుకుంటేనే అసాధ్యం అనిపిస్తుంది క‌దా.ఎందుకంటే ఓ వైపు ఆక‌లి వేస్తున్న స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌యోగాలు అవ‌స‌ర‌మా అని చిరాకు కూడా వేస్తుంది.

మ‌రి వ్యోమగామిల ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది క‌దా.ఈ ప్ర‌పంచంలో చాలా కష్టమైన ప‌నుల్లో ఈ వ్యోమ‌గామి ఒకటిని చెప్పొచ్చు.

కార‌ణం ఏంటంటే వీరంతా కూడా భూమికి దూరంగా వేలాది మైళ్లు ప్రయాణిస్తూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సంస్థ తమకు ఇచ్చిన స్ప‌ష్ట‌మైన ప‌నిని ఎట్టి ప‌రిస్థితుల్లో కంప్లీట్ చేయాల్సిందే.

Advertisement

లేక‌పోతే మాత్రం వారి ప్ర‌యాణం ఒక ఫెయిల్యూర్ మిషిన్‌గానే మిగిలిపోతుంది.ఈ కార‌ణంతోనే వారంతా కూడా ఎంతో జాగ్ర‌త్త‌గా త‌మ‌కు ఇచ్చిన ప‌నిని పూర్తి చేస్తారు.

అయితే ఇప్పుడు పెరుగుత‌న్న టెక్నాలజీ పుణ్యమా అని వ్యోమ‌గాముల‌కు చాలా ఇబ్బందులు త‌ప్పుతున్నాయి.వారు కూడా స్పేస్ ప్ర‌యాణం గ‌తంలో కంటే కొంత సులువుగానే చేస్తున్నారు.

కాగా ఇప్న‌ప‌డుఉ కొంద‌రు వ్యోమగాములు అంతరిక్షంలో పిజ్జాలు తింటున్న వీడియో వైరల్‌గా మారింది నెట్టింట‌.అదేంటంటే ఈ వీడియోలో వారంతా కూడా అక్కడ స‌ర‌దాగా పిజ్జా పార్టీ చేసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇందులో కొందరు వ్యోమగాములు ఒక టేబుల్ ద‌గ్గ‌ర క‌లిసి గాలిలో ఎగురుతున్న పిజ్జాలు చేతుల‌తో కాకుండా నోటితో ప‌ట్టుకొని తిన‌డాన్ని మ‌నం చూడొచ్చు.మ‌రి స్పేస్ కాబ‌ట్టి ఇక్క‌డ ఏదైనా అలా ఎగురుతూనే ఉంటాయి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

ఎంత పెద్ద వ‌స్తువు అయినా స‌రే ఇక్క‌డ గాల్లో గింగిరాలు కొట్టాల్సిందే మ‌రి.కాగా వీరు కూడా ఇలాగే గాలిలో ఎగురుతున్న పిజ్జాలు తింటున్న వీడియోను ఇప్పుడు నెటిజ‌న్లు బాగా ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

అదేంటో మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు