ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా.అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయింది.
నలుగురు బీజేపీ ఎంపిలు ఏం చేస్తున్నారు.తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా.
కేసీఆర్ ను ఎలా గద్దె దింపాలని మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళారా.ఏపీలో పోలవరానికి 40 వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వరు.
బీజేపీకి అధికారకాంక్ష తప్ప తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు.సీఎం కేసీఆర్ వరి వేయద్దంటే బండి సంజయ్ వరి వేయాలని అంటాడు.
కేంద్ర మంత్రి వద్ద వరి వేయాలని బండి సంజయ్ మాట్లాడితే నాలుక మీద వాత పెడుతారు.యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలి.