ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించి ఏదైనా కొత్తగా కనిపెట్టాలి అని మన శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధిస్తున్నా రు.దాని కోసం ఎంతో కృషి చేస్తూ అంతరిక్షంలోకి శాటిలైట్ పంపిస్తూ ఉంటారు.
ఇలా నిరంతరం శాస్త్రవేత్తల కృషి చేస్తూ ఉంటారు.కానీ పాకిస్థాన్ కి చెందిన ఒక పైలెట్ మాత్రం ఆకాశంలో ఎగిరే ఒక వింత వస్తువు ను కనుగొన్నాడు.
దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక విషయంలోకి వెళితే ఈ నెల 23న పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ను లాహోర్ నుంచి కరాచీకి నడుపుతున్నారు.
రహీమ్ యార్ ఖాన్ అనే ప్రాంతం పై ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువు కనిపించింది.దీనిని పాకిస్థాన్ కు చెందిన ఒక విమాన పైలెట్ ఆకాశంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువు యుఎప్ వో గుర్తించారు.

ఆకాశంలో ఎగిరే వస్తువు ను చూసిన పైలెట్ ఆ విషయాన్ని కంట్రోల్ రూమ్ కు తెలియజేశాడు.విమాన పైలెట్ తో పాటు రహీమ్ యార్ ఖాన్ అనే ప్రాంతవాసులు కూడా దీనిని చూశారు.కొందరు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్ లో వీడియోలు ఫోటోలు కూడా తీశారు.
ఈ నెల 23న సాయంత్రం నాలుగు గంటల సమయం లో రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంపై భారీ సైజు లో యుఎప్ వో ను గుర్తించడం చాలా అరుదు అని కొన్ని వర్గాలు తెలిపాయి.
ఇది స్పేస్ స్టేషన్ లేదా సారి లేదు కావచ్చు అని వారు అభిప్రాయపడ్డారు.ఇది ఏమిటి అని ఖచ్చితంగా చెప్పలేము అని తెలిపారు.దీనినే గుర్తు తెలియని ఎగిరే ఒక వస్తువు గా గుర్తించడం పై నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు రిపోర్టు చేసినట్టు వెల్లడించారు.