ఈ ఎలుక చూడండి ఎంత చక్కగా పోజులు ఇచ్చిందో.. క్యూట్ వీడియో వైరల్!

పెంపుడు జంతువులు, వాటి అమాయక చేష్టలు చూడటానికి భలే ముచ్చటగా ఉంటాయి.ఇక చిన్న ఎలుకలు, పిల్లులు, ఉడుతలు చేసే పనులు కూడా మనల్ని నవ్విస్తాయి.

 Photographer Julian Rad Captured Cute Rat Photos Viral,photographer Julian Rad,r-TeluguStop.com

అయితే తాజాగా ఒక అడవి చిట్టెలుక ఫొటో కోసం పోజులిచ్చిన తీరు ఇప్పుడు అందరి హృదయాలను దోచేస్తోంది.బ్యూటెంగెబిడెన్ అనే ట్విటర్‌ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది.“మీరు అడవి చిట్టెలుక కెమెరా ముందుకు వచ్చి ఫొటోషూట్ చేయడం ఎప్పుడైనా తిలకించారా?” అని ఓ క్యాప్షన్ ఈ వీడియోకి బ్యూటెంగెబిడెన్ పేజీ యాడ్ చేసింది.జూలియన్ రాడ్ అనే వైల్డ్ ఫోటోగ్రాఫర్‌ ఈ ఫొటోలు తీశాడు.అలానే వీడియో కూడా తీశాడు.

22-సెకన్ల వీడియో క్లిప్‌లో ఒక చిన్న ఎలుక భూమిలోపల నుంచి దాని తలను బయటకు పెట్టడం చూడవచ్చు.ఆ తర్వాత అది ఒక పువ్వును తినడానికి పైకి వచ్చింది.దాని ముందే ఒక ఫోటోగ్రాఫర్ కెమెరాను పట్టుకొని దాన్ని ఫోటోలు తీయాలి అనుకున్నాడు.అయితే ఆ ఎలుక పెద్ద కెమెరాని చూసినా భయపడలేదు.ఎంచక్కా ఫోటోలకి ఫోజులిస్తూ ఆశ్చర్యపరిచింది.
ఈ చిట్టెలుక గడ్డితో కప్పబడిన నేల నుంచి బయటకు వచ్చి పువ్వును తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ దాని చేతికి పువ్వును అందించాడు.తర్వాత చిట్టెలుక పువ్వును పట్టుకుని ఉన్న షాట్‌లు తీయడం స్టార్ట్ చేశాడు.

కెమెరా షట్టర్‌ల సౌండ్, పువ్వుపై నిబ్లింగ్ సౌండ్ చాలా ముచ్చటగా అనిపించాయి.తరువాత వీడియోలో, ఫోటోగ్రాఫర్ చిట్టెలుక అద్భుతమైన ఫోటోలు తీసుకున్నాడు.

అనేక కెమెరా కోణాల నుంచి తీసిన ఈ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి.ఈ వీడియోకి ఇప్పటికే 50 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube