ఉయ్యాల జంపాల చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం.ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.
సినిమాతో వచ్చిన గుర్తింపు కంటే ఈ అమ్మడికి బిగ్‌బాస్ వల్ల అమితమైన గుర్తింపు వచ్చింది.దాంతో ప్రస్తుతం తన స్టార్‌డంను ఎంజాయ్ చేస్తుంది.
భారీ ఎత్తున క్రేజ్‌ను దక్కించుకున్న ఈ అమ్మడు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా ఇప్పటికే నటిస్తుంది.
ఇదే సమయంలో మీడియా దృష్టి మరియు సినీ జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకునే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు వరుసగా హాట్ ఫొటో స్టిల్స్‌తో రెచ్చి పోతుంది.తాజాగా పునర్నవి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.మరీ ఇంత హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు మాత్రం కళ్లతో చూసి ఆనందిస్తున్నారు.
ఇక ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేస్తుందని కొందరు అంటున్నారు.
రాహుల్‌కు బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ రావడంలో పున్ను కీలక పాత్ర పోషించింది అంటూ ఆమె అభిమానులు అంటూ ఉంటారు.ఆ విషయం ఏమో కాని ప్రస్తుతం ఈ అమ్మడు మాత్రం రాహుల్‌తో కలిసి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంది.ఇద్దరి మద్య స్నేహంను మించిన బందం ఏదో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఏదో ఒక రోజున వీరిద్దరు బరస్ట్ అవ్వకుండా ఉంటారా అంటూ నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు.