ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది.గత రెండు సంవత్సరాలుగా ఈ చిత్రంపై అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి.
ఇటీవల ఈ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్ మరియు ఎన్టీఆర్ సీన్ ఒకటి బయటకు వచ్చింది.దాంతో అంతా కూడా చరణ్ లుక్ ఎలా ఉంటుందా అంటూ నెట్‌లో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వారి ప్రయత్నాలు లీక్‌లకు దారి తీయకుండా ఉండాలంటే అధికారికంగా బయట పెట్టాలని జక్కన్న నిర్ణయించుకున్నాడట.

లీక్‌లతో తల బొప్పి కట్టించుకునే బదులు డైరెక్ట్‌గా హీరోల పోస్టర్‌లను విడుదల చేయడం మంచిది కదా అంటూ సినీ వర్గాల నుండి జక్కన్నకు సలహా వచ్చిందట.దాంతో అదే నిర్ణయాన్ని రాజమౌళి తీసుకున్నాడట.ఒక మంచి అకేషన్‌ను చూసి తప్పకుండా సినిమా ఫస్ట్‌లుక్‌ను తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోవచ్చు అంటూ క్లారిటీ వచ్చింది.

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మరియు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌లు కూడా ఉండటంతో సినిమాపై అక్కడ కూడా అంచనాలు పెరుగుతున్నాయి.బాహుబలి తర్వాత సినిమా కనుక ఈ చిత్రంపై సహజంగానే భారీగా అంచనాలు ఉంటాయి.ఆ అంచనాలను ఖచ్చితంగా నిలబెట్టుకునేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇదే ఏడాది చివరి వరకు ఈ చిత్రం వచ్చే అవకాశాలున్నాయి.







