అల్లు అర్జున్‌కు ఒకింత దేశ భక్తి ఎక్కువ అని ఆయన సినిమాలు చూసినా ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లు చూసినా కూడా అనిపిస్తూ ఉంటుంది.ఇక ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు కూడా దేశ భక్తి చాలా ఎక్కువ అంటూ తాజాగా ఈ సంఘటనతో నిరూపితం అయ్యింది.
నిన్న రిపబ్లిక్ డే సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి.దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైతే ఇండియన్స్ ఉన్నారో అక్కడ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి.
ఇక హైదరాబాద్‌లో కూడా అంబరాన్నీ తాకేలా సంబురాలు జరిగాయి.కాని హైదరాబాద్‌లో అల్లు వారు చేసిన ప్రత్యేకమైన ఏర్పాట్లతో రిపబ్లిక్‌డే సందడి అంతా కూడా అల్లు వారి వద్ద ఉన్నదా అన్నట్లుగా అనిపించింది.అద్బుతమైన లైటింగ్‌తో గీతాఆర్ట్స్ ఆఫీస్ మొత్తం కళకళలాడింది.అయితే సాదారణ లైంటింగ్‌తో గీతాఆర్ట్స్ ఆఫీస్ వెలిగితే పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు.కాని గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఒక మూడు రంగుల జెండా మాదిరిగా కనిపించేలా లైట్లు ఏర్పాట్లు చేశారు.
అద్బుతమైన ఆ సెట్టింగ్‌తో చూడ్డానికి రెండు కళ్లు చాలలేదు.పెద్ద ఎత్తున సినీ మరియు మీడియా రంగానికి చెందిన వారు గీతాఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లి మరీ చూసి వచ్చారు అంటే ఏ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిందో చెప్పుకోవచ్చు.ఈ ఫొటోను షేర్ చేసిన అల్లు అర్జున్ గీతాఆర్ట్స్‌లో ఇంతగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు.