ఓవర్‌నైట్ కోటీశ్వరురాలు అయిపోయిన ఓ సేల్స్ ఉమెన్.. ఆమె కథ వింటే ఆశ్చర్యపోతారు!

ఆమె ఓ సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తోంది.అయితేనేం, ఆమె నేడు కోటీశ్వరురాలుగా అవతరించింది.

ఎలాగంటే ఆమె తాజాగా నిర్వహించిన సూపర్ శాటర్‌డే డ్రాలో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకుంది.అంటే.ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.22.47కోట్లు అన్నమాట.దాంతో ఆమె రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా అవతరించింది.

కాగా ఆమె గెలుచుకున్న ప్రైజ్ మనీ చెక్‌ను మహజూజ్ నిర్వాహకులు ఈ బుధవారం ఆమెకు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళితే, ఫిలిప్పీన్స్‌కు చెందిన 40 ఏళ్ల వయస్సు గల అర్లీన్ గత 12 ఏళ్ల నుంచి UAE రాజధాని అబుదాబిలో నివాసం ఉంటోంది.ఆమె స్థానికంగా ఉండే ఓ మార్కెటింగ్ సంస్థలో సేల్స్ ప్రమోటర్‌గా సేవలని కొనసాగిస్తోంది.ఆమెకు వచ్చే నెలవారీ వేతనం చాలా తక్కువ కావడంతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడేది.

Advertisement

దాంతో చాలాసార్లు అవసరాలకు ఇరుగుపొరుగువారిదగ్గర, స్నేహితుల వద్ద అప్పులు తీసుకుంటూ జీవితాన్ని వెళ్లబుచ్చేది.ఈ క్రమంలో స్నేహితుల సలహా మేరకు మహజూజ్‌లో పాల్గొంది.ఇంకేముంది కట్ చేస్తే ఆమెని అదృష్ట దేవత వరించింది.

గత శనివారం నిర్వహించిన డ్రాలో ఏకంగా రూ.22.47కోట్ల జాక్‌పాట్ ఆమెని వరించింది.కాగా తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన కష్టాలన్ని తీరిపోతాయని ఆమె ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇకపై స్నేహితులను అప్పులు ఇమ్మని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని, వారికి అవసరం అయితే నేనే అప్పులు ఇస్తానని తెలిపింది.ఇక ఈ ఏడాది ఇలా మల్టీ మిలియనీర్‌గా మారిన రెండో ఫిలిప్పీన్స్ ప్రవాసురాలు అర్లీన్ అని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగిలినట్లు వెల్లడించారు.మొత్తంగా మహజూజ్ రాఫెల్ ప్రారంభమైన 2021 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఫిలిప్పీన్స్ జాతీయులు ఇలా 10 మిలియన్ దిర్హమ్స్ లాటరీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు