యాంకర్: ఐసీఎస్, లష్కర్ ఉగ్రవాద మూలాలు కలిగి వాటిలో చేరి ప్రధానిపై దాడికి యత్నిస్తున్న
పిఎఫ్ఐ పార్టీ
ను ఏపి రాష్ట్రంలో సమూలంగా నాశనం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు బిజేపి నేత విష్ణు వర్ధన్ రెడ్డి.ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తీవ్రవాద ప్రేరేపిత పార్టీ పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థ ఎస్డీపిఐను రాష్ట్రంలో నిషేధించాలి అని కోరారు.
ఇక నిన్న టిటిడి పాలకమండలిలో శ్రీవారి స్థిర ఆస్తుల విలువ 87 వేల కోట్లుగా శ్వేత పత్రాన్ని విడుదల చేయాడాన్ని ప్రశంసించారు.
రాష్ట్రంలోని దేవాదాయ శాఖ క్రిందకు వచ్చే ఇతర దేవాలయాలను ఆస్తులను కూడా టిటిడి తరహాలో బహిర్గతం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.







