పెట్రోల్ రీడింగుతో భారీ మోసం.. బట్ట బయలైన వ్యవహారం..!

పెరిగిన ఇంధనం ధరలతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.అది చాలదన్నట్లు వాహనదారులను కొందరు పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు భారీగా దోచుకుంటున్నారు.

మీటర్లలో ప్రత్యేకమైన చిప్ ‌లు పెట్టి జనాలను అడ్డ గోలుగా మోసం చేస్తున్నారు.ఈ చిప్ ‌లతో రీడింగ్‌ సరిగానే చూపెట్టినా పెట్రోల్‌ మాత్రం కొంత మేరకు తక్కువగా వస్తుంది.

సమాచారం అందుకున్న SOT (స్పెషల్ ఆపరేషన్ టీం) పోలీసులు కొన్ని పెట్రోల్ బంకులపై దాడి చేసి తనిఖీలు చేయగా ఈ వ్యవహారం కాస్త బయటపడింది.మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్‌ పరిధిలో దాదాపుగా 13 పెట్రోల్ బంక్‌ లను SOT పోలీసులు సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఆ తరహా మోసాలకు పాల్పడుతున్న 26 మందిని సైబరాబాద్‌ SOT పోలీసులు అరెస్ట్ చేశారు.ఇక SOT పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా 26 పెట్రోల్ బంకులను అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం.

Advertisement

ఇక్కడ కూడా ఆ తరహా మోసాలు అనేకం జరుగుతున్నాయని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.ఈ చిప్‌ లను ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుని నిందితులు వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి దోపిడీ జరుగుతోందని, అందరిపైనా చర్యలు తీసుకుంటామని SOT పోలీసులు వెల్లడించారు.చిప్ ‌లను ఉపయోగించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు వీరు పాల్పడుతున్న ట్లు తెలిపారు.

ఇది అనైతికమైన చర్య అని, అసలే పెట్రోలు ధరలు రోజు రోజుకీ మండిపోతున్న తరుణంలో ఇలాంటి మోసాలు వాహనదారుల పట్ల ఎంతో దారుణమని, ఈ ముఠా వెనకాల ఉన్నవారిని విడిచిపెట్టబోమని అన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు