డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.టిక్కెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడం పట్ల.
ఆర్జివి ఫుల్ ఫైర్ అవుతున్నారు.అంత మాత్రమే కాక సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు కూడా ఏపీ ప్రభుత్వానికి సంధించారు.
ఈ పరిణామాలతో ప్రస్తుతం రాంగోపాల్ వర్మ వర్సెస్ వైసిపి అన్నట్టు పరిస్థితి మారింది.
మీడియా ఛానల్ లో అదే విధంగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న వ్యాఖ్యలకు మరోపక్క వైసీపీ మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మకి వైసీపీ మంత్రి.పేర్ని నాని అపాయింట్మెంట్ ఖరారు చేశారు.
సినిమా సమస్యలు వివరించటానికి.అపాయింట్మెంట్ కోరిన రామ్ గోపాల్ వర్మ కి.పేర్ని నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంతకుముందే రామ్గోపాల్వర్మ అడిగిన పలు ప్రశ్నలకు పేర్నినాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఈ తరుణంలో నేరుగా రామ్ గోపాల్ వర్మ కి.పేర్ని నాని అపాయింట్మెంట్ ఖరారు చేయడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.