ఒక దెబ్బకు రెండు పిట్టలు ! అదరగొట్టే వ్యూహంతో కేసీఆర్ ? 

టీఆర్ఎస్ కు ఈటెల రాజేందర్, రాజేందర్ కు టిఆర్ఎస్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటెల ను బర్తరఫ్ చేసి కెసిఆర్ తన పంతం నెగ్గించుకున్నారు.

 Kcr Political Strategy On Etela Rajendar And Harish Rao, Kcr, Etela Rajendar, Ha-TeluguStop.com

అంతేకాకుండా ఈటెల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ ఆయన పై ఏసీబీ విచారణను సైతం ప్రభుత్వం చేయిస్తోంది.ఈ క్రమంలోనే మంత్రి గంగుల కమలాకర్ ను టిఆర్ఎస్ రంగంలోకి దించి విమర్శలు చేస్తున్నా, ఆ విమర్శలు జనాల్లోకి వెళ్లడం లేదని, పైగా ఈటెల రాజేందర్ పై సానుభూతి పెరుగుతోంది అనే విషయాన్ని కెసిఆర్ గుర్తించారు.

 టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మంచి  సన్నిహిత సంబంధాలు ఉండడం, బలమైన నాయకుడిగా ముద్ర వేసుకోవడంతో ఆయనను ఎదుర్కొనేందుకు ఈటెల కు సరి సమానం అయిన  కెసిఆర్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు హుజూరాబాద్ నియోజకవర్గం లోని నేతలందరికీ సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది .తాము పార్టీ మారడం లేదని టిఆర్ఎస్ లో ఉంటామంటూ నిరూపించుకోవాల్సిన నేతలంతా హరీష్ వద్దకు వెళ్లాల్సిన పార్టీ నుంచి అనధికారిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈటెల రాజేందర్ తో పాటు హరీష్ రావు ఉద్యమ కాలం నుంచి ఉండడం, రాజేందర్, హరీష్ రావు  ఇద్దరూ సరిసమానమైన నేతలు అనే విషయాన్ని ఎప్పుడో గుర్తించిన కేసీఆర్ ఇప్పుడు హరీష్ ను రంగంలోకి దించడం ద్వారా,  వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని ,దీని కారణంగా ఇద్దరి ప్రభావం తగ్గుతుందని , ఈ రకంగా అయినా హరీష్ రావు ప్రభావాన్ని తగ్గించవచ్చునని కేసీఆర్ అభిప్రాయపడుతూ ఉండడంతోనే , ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

Telugu Etela Rajendar, Etela Rajender, Hareesh Rao, Harish Rao, Hujurabad, Kcrst

అసలు మొదట్లోనే గంగుల కమలాకర్ ను రంగంలోకి దించకుండా,  హరీష్ రావు ని  రంగంలోకి దించి ఉంటే ఫలితం వేరేగా వచ్చి ఉండేదని, గంగుల రాజకీయం ఈటెల ముందు తేలిపోతోంది అని కేసీఆర్ అంచనా వేశారట.ఈటెల హరీష్ రావు మధ్య మాటల యుద్ధం ముదిరితే అది తమకే మేలు చేస్తుందని , భవిష్యత్తులోనూ కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే కేసీఆర్  ఇప్పుడు ఈ విధంగా హరీష్ ను ఈటెల పై కి అస్త్రంగా వదిలినట్లు టిఆర్ఎస్ వర్గాల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube