మీ అదృష్ట సంఖ్య రెండా? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

సంఖ్యా శాస్త్రం ప్రకారం రెండో తారీఖున జన్మించిన వారి యొక్క ఆలోచన విధానం, గుణగణాలు, మనస్తత్వం,వారి బలాలు,బలహీనతలు వంటి విషయాల గురించి తెలుసుకుందాం.ఏ సంవత్సరం అయినా, ఏ నెలలో అయినా రెండో తారీఖున జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం.

 People Born On The 2nd Of Every Month-TeluguStop.com

రెండో తారీఖున జన్మించిన వారి మీద చంద్ర గ్రహ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల వీరు సూక్ష్మ బుద్ది, మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది.

ఏదైనా కొత్త పనిని నేర్చుకోవాలని అనుకుంటే చాలా స్పీడ్ గా నేర్చుకొనే నేర్పు వీరిలో అధికంగా ఉంటుంది.జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే కష్టపడి సాధించుకుంటారు.

అయితే అపజయాలు వస్తే మాత్రం వీరు తట్టుకోవటం కష్టమే.

ఎందుకంటే వీరిని చంద్రుడు ఎక్కువగా ప్రభావితం చేయటం వలన కొంత అపజయం లేదా ఓటమి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడతారు.

రెండో తారీఖున పుట్టిన వారు కీలకమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు కూడా కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటారు.వీరికి తెలివితేటలు అధికంగా ఉన్నాసరే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక మీమాంస ధోరణిలో ఉండిపోవటం వలన మంచి అవకాశాలను కోల్పోతారు.

వీరు ఉల్లాసంగా,ఉత్సహంగా ఉండటం వలన సృజనాత్మక రంగంలో ఎక్కువగా రాణింపు ఉంటుంది.వీరు ఎక్కువగా మానసిక శ్రమ చేయటానికి ఇష్టపడతారు.

అందువల్ల వీరు శారీరక శ్రమ చేసే వృత్తుల్లో రాణించలేరు.వీరి మనస్సులో ఎప్పుడు ఎదో ఒక ఆలోచన ఉంటూనే ఉంటుంది.

వీరు ఒక పని చేస్తూ మరో పని గురించి ఆలోచిస్తూ ఉంటారు.వీరు బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవటం వలన తప్పటడుగు వేయకుండా ముందుకు సాగుతారు.

అంతేకాక వీరు తీసుకొనే నిర్ణయాల కారణంగా విజయాల శాతం ఎక్కువగా ఉంటుంది.

అయితే ఏదైనా ఓటమి వచ్చినప్పుడు మాత్రం దాని నుంచి తొందరగా బయట పడే ప్రయత్నం చేయరు.

గతంలో జరిగిన చెడూ విషయాలను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు.గతం గురించి మర్చిపోయి భవిష్యత్ మీద దృష్టి పెట్టటం మంచిది.

వీరి ఆలోచనలతో ఎదుటి వ్యక్తుల్లో మార్పును తీసుకువస్తారు.వీరు గొడవల్లోకి అసలు వెళ్ళరు.

వీరికి ఇబ్బంది కలిగించిన వ్యక్తులతో గొడవ పడకుండా అంతా దేవుడు చూసుకుంటాడు అనే ధోరణిలో ఉంటారు.

వీరు గొడవలు లేకుండా జీవితం సరదాగా ఉండాలని కోరుకుంటారు.

వీరు ప్రతి రోజు యోగ,మెడిటేషన్ వంటివి చేస్తే మంచిది.వీరు లక్ష్మి దేవిని పూజిస్తే మంచిది.

సోమవారం, పౌర్ణమి తిధి ఉన్నప్పుడు చంద్రుడు యొక్క ప్రభావం అందరి మీద అధికంగా ఉంటుంది.ఈ రెండో తారీఖున జన్మించిన వారి మీద అధికంగా ఉంటుంది.

అందువల్ల పొర్ణమి రోజు చంద్ర కిరణాలు మీద పడేలా బయటకు వెళ్ళాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube