బాబు వల్ల అవ్వాతాతలకు పెన్షన్ కష్టాలు.. పండుటాకులను ఇంతలా ఇబ్బంది పెట్టాలా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ చేసిన పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవ్వాతాతలు పడుతున్న కష్టాలు అంతాఇంతా కాదు.

మార్చి నెల వరకు ఒకటో తేదీ వచ్చిందంటే కోడి కూయకముందే వాలంటీర్లు వచ్చి అవ్వా తాతా అంటూ ప్రేమగా పింఛన్ ఇచ్చేవారు.

టీడీపీ అనుకూల వ్యక్తులు వాలంటీర్ల( AP Volunteers ) చేత పింఛన్ పంపిణీ చేయకూడదని ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నెల అవ్వాతాతల బ్యాంక్ ఖాతాలలో పింఛన్ డబ్బులు జమయ్యాయి.

Pension Troubles To Ap People Because Of Chandrababu Naidu Details Here ,chand

పింఛన్ డబ్బుల కోసం అవ్వాతాతలు మండుటెండలో బ్యాంకుల ముందు, కస్టమర్ సర్వీస్ పాయింట్ల ముందు బారులు తీరి గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.60 ఏళ్లు దాటిన వృద్ధులను చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంతలా ఇబ్బందులు పెట్టడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబు( Chandrababu naidu ) ఇప్పుడే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడంటే అధికారం ఇస్తే అష్టకష్టాలకు గురి చేస్తాడని ఈ ఎన్నికల్లో మా ఓట్లు మాత్రం వైసీపీకే అని అవ్వాతాతలు చెబుతున్నారు.

Pension Troubles To Ap People Because Of Chandrababu Naidu Details Here ,chand

జగన్ ( CM ys jagan )ను మరోసారి సీఎంగా గెలిపించుకుని కూటమికి తగిన బుద్ధి చెబుతామని అవ్వాతాతలు వాపోతున్నారు.గ్రామాలకు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బ్యాంకుల చుట్టూ పింఛన్ కోసం తిరగాల్సిన దారుణమైన పరిస్థితిని చంద్రబాబు నాయుడు కల్పించాడని రాష్ట్రంలోని అవ్వాతాతలు ఆవేదన చెందడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.చంద్రబాబుకు తమపై ఇంత కక్ష ఎందుకని అవ్వాతాతలు బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు.వాలంటీర్లపై విషం చిమ్మి సకాలంలో పింఛన్ అందకుండా చేసి చంద్రబాబు తమ నోటి దగ్గర కూడను లాగేసుకుంటున్నారని కొంతమంది అవ్వాతాతలు కన్నీటి పర్యంతమయ్యారు.2014 చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బాబు తీరు ఎప్పటికీ మారదని వృద్ధులు ఆవేదన చెందుతున్నారు.రాష్ట్రంలో మళ్లీ వైసీపీని గెలిపించుకుంటే మాత్రమే సంక్షేమ పథకాల ఫలాలను సకాలంలో పొందుతామని ఏపీ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Pension Troubles To Ap People Because Of Chandrababu Naidu Details Here ,chand
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు