పెళ్లి సందడి మళ్ళీ మొదలు !

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన దర్శకుల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ , దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఒకరు.ఒకానొక సమయంలో వరుస సినిమాలతో దూసుకుపోయిన రాఘవేంద్ర రావు .

 Pellisandadi Starts Again-TeluguStop.com

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు.అంతేకాదు శతాధిక సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అరుదైన ఘనత సాధించాడు.ఆ తర్వాత కొంచెం గ్యాప్ తో తాజాగా మరో సినిమా అనౌన్స్ చేసి అభిమానులకి మంచి కిక్ ఇచ్చే వార్త చెప్పారు.

”పెళ్లి సందడి మళ్ళీ మొదలవ్వబోతుంది.తారాగణం త్వరలో.” అంటూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.కె.కృష్ణమోహన్ రావు సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారని చెప్తూ టైటిల్ లుక్‌ తో కూడిన వీడియో విడుదల చేశారు.గత 25 ఏళ్ల క్రింద 1996లో ‘పెళ్లి సందడి’ సినిమాను ప్రేక్షకుల ముందుంచి భారీ సక్సెస్ అందుకున్నారు రాఘవేంద్ర రావు.కీరవాణి అందించిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి.

 Pellisandadi Starts Again-పెళ్లి సందడి మళ్ళీ మొదలు -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ పెళ్లి సందడి పాటలు వినిపిస్తూనే ఉంటాయి.అలాంటి ఎవర్‌గ్రీన్ కాంబో మరోసారి అదే ‘పెళ్లి సందడి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుండటం జనాల్లో ఆతృత పెంచేసింది.

ఇక అప్పటి పెళ్లి సందడి లో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలలో నటించగా .ఈ పెళ్లి సందడి పూర్తిగా కొత్త వారితో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.

#Raghavendhararo #Pellisandadi #Srikanth #Kiravani #Ravali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు