పోలీసుల నిఘాలో ‘పెడన’..!!

కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం పోలీసుల వలయంలోకి వెళ్లింది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

అయితే వారాహి విజయ యాత్రలో భాగంగా వైసీపీ నేతలు తనపై రాళ్ల దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని, ఈ మేరకు తనకు సమాచారం వచ్చిందని నిన్న పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పెడనలో పోలీసులు భారీగా మోహరించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.కాగా తోటమూల సెంటర్ లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు జనసేనాని పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా కొనసాగుతోంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు