రూ.3,150 కోట్లు ఇస్తేనే 'ఉపకారంకు మోక్షం ఎప్పుడు? - PDSU

బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు ఇంకా ఎన్నినాళ్లు?.PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్ వెంకటేష్.

ప్రభుత్వానికి సూటి ప్రశ్న.ఖమ్మంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో వందలాదిమంది విద్యార్థులతో చలో కలెక్టరేట్.

ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్య మంత్రి జీతాలు పెంచుకోవడంలో ప్రతినెల సమయానికి తీసుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించడంలో కేసీఆర్ ప్రభుత్వం చూపించాలని పిడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నామాల ఆజాద్ బి వెంకటేష్ లు ప్రభుత్వాన్ని విమర్శించారు.విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చలో కలెక్టరేట్లో భాగంగా పెవిలియన్ గ్రౌండ్ నుండి మయూరి సెంటర్, పాత బస్టాండ్, బాబురావు పెట్రోల్ బంక్,పాత ఎల్ఐసి ఆఫీస్, జెడ్పి మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి జెడ్పి ఎదుట ధర్నా చేయడం జరిగింది.

అనంతరం డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అడిషనల్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది.

Advertisement
ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టించిన సినిమాలు ఇవే !

Latest Latest News - Telugu News