పవన్ వర్సెస్ పేర్ని ! బందర్ లో నాని గ్రాఫ్ ఏంటో ?

గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( pavan kalyan ) కు మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని( perni nani ) కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నానిని టార్గెట్ చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు.

అన్నవరంలో తన రెండు చెప్పులు పోయాయని , అవి ఎవరు దొంగిలించారో దయచేసి తిరిగి ఇచ్చేయాలంటూ పరోక్షంగా పేర్ని నానిని ఉద్దేశించి పవన్ విమర్శలు చేయగా, నాని కూడా అంతే స్థాయిలో పవన్ కు కౌంటర్ ఇచ్చారు.ఈ విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన, జగన్( YS Jagan ) పైన ఏ విమర్శలు చేసినా, పేర్ని నాని వెంటనే రియాక్ట్ అవుతూ, కౌంటర్ ఇస్తూ వస్తుండడం తో జనసైనికులకు, పేర్ని నాని టార్గెట్ అయ్యారు.వచ్చే ఎన్నికల్లో నానిని ఓడించాలనే లక్ష్యంతో జనసేన ఉంది.

అందుకే నానిని లక్ష్యంగా చేసుకునే విధంగా జనసేన ఆవిర్భావ సభను బందర్ లో నిర్వహించి, నాని పై ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్ విమర్శలు చేశారు.ఇక ఇప్పటికీ పేర్ని నాని పవన్ కళ్యాణ్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement

కాపు సామాజిక వర్గానికి చెందిన నాని అదే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకోవడం పై నాని పై కాపు సామాజికవర్గం గుర్రుగా ఉందని, పవన్ కళ్యాణ్ నానిని టార్గెట్ చేసుకోవడంతో, వ్యతిరేకత పెరిగిందట.

పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం( Machilipatnam ) నియోజకవర్గంలో మొత్తం 65 వేల వరకు కాపు ఓటు బ్యాంకు ఉంది.దీంతో ఆ వర్గం ఓట్లలో వ్యతిరేకత పెరిగితే, ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం కనిపిస్తోంది.ఇక ప్రస్తుతం పేర్ని నానిని టార్గెట్ చేసుకుని మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న జనసేన నాయకుల్లో ఎక్కువమంది కాపు సామాజిక వర్గం వారే ఉండడంతో, ఆ వర్గం ఓట్లలో చీలిక వచ్చి నానికి ఇబ్బందులు ఏర్పడతాయని జనసేన భావిస్తుంది.

అయితే పేర్ని నాని మాత్రం మచిలీపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, పనులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ  తమ గెలుపునకు ధోఖా లేకుండా చేస్తాయని, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకుతో పాటు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారు, అలాగే కాపు సామజిక వర్గం నుంచి తనకు పడే ఓటు బ్యాంకుతో, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినా, తన కుమారుడు కిట్టు పోటీ చేసినా, గెలుపునకు డోఖా ఉండదు అనే నమ్మకంతో పేర్ని నాని ఉండగా, నాని పై బలమైన అభ్యర్థిని పోటీకి దింపి, ఆయన ఓడించడమే లక్ష్యంగా జనసేన( Janasena ) వ్యూహాలు రచిస్తోంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు