బండరాళ్ల మధ్యలో ఇంటి నిర్మాణం.. ఎలా ఉందో చూడండి

కోండలపై ఇళ్లు కట్టుకోవడం మనం చూసే ఉంటాం.సిటీలలో కూడా చిన్న చిన్న కోండలపై ఇళ్లు కట్టుకుంటూ ఉంటారు.

 Software Engineer Builds Extraordinary Stone House In Portugal Details, Viral Ne-TeluguStop.com

ప్రశాంతమైన వాతావరణం కోసం, ఖాళీ స్థలం లేక ఇలా కోండలపైన ఇళ్లు నిర్మించుకుంటూ ఉంటారు.ఎత్తులో ఇల్లు నిర్మించుకోవడం వల్ల గాలి కూడా బాగా వస్తుంది.

అలాగే వర్షాకాలంలో నీళ్లు కూడా నిల్వ ఉండవు.అయితే పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో ఇంటి నిర్మాణం( Stone House ) చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా.

ఒక వ్యక్తి ఇప్పుడు అదే పని చేశాడు.

Telugu Casa Ponedo, Middle Boulders, Portugal, Stone, Latest-Latest News - Telug

పోర్చుగల్‌లోని( Portugal ) గిమెరెస్‌లో ఒక స్థానిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్( Software Engineer ) కొండ ప్రాంతంలో ఒకదానికొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి ఇళ్లు నిర్మించుకున్నాడు.దీనిని ఫామ్‌హౌస్‌లా ఉపయోగించుకుంటున్నాడు.1972లో దీనిని నిర్మించారు.అయితే విచిత్రంగా ఉన్న ఈ ఇటిని చూసేందుకు జనం తెగ వస్తోన్నారు.దీంతో జనాల రద్దీని తట్టుకోలేక వేరే ప్రాంతంలో ఫామ్‌హౌస్‌ని నిర్మించుకుని వెళ్లిపోయాడు.అయితే బండరాళ్ల మధ్య నిర్మించిన ఇంటిలోని ఫర్నిచర్, ఇరత సామాగ్రిని అలా ఉంచి వెళ్లిపోయాడు.

Telugu Casa Ponedo, Middle Boulders, Portugal, Stone, Latest-Latest News - Telug

ఇక బండరాళ్ల మధ్య నిర్మించిన ఆకర్షణీయమైన ఈ ఇంటిని మ్యూజియంగా మార్చారు.దీంతో ఈ కట్టడం పోర్చగల్‌లో పర్యాటక ఆకర్షణగా మారింది.ఆ శిలాగృహానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌ గా మారాయి.

ఆధునిక కాలంలో నిర్మించిన ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిర్మించిన ఈ ఇల్లు ఇప్పుడు ఫేమస్ స్థలంగా మారిపోయింది.

చూడటానికి ఆ ఇల్లు చాలా అందంగా ఉంది.చుట్టూ పచ్చని చెట్లు, పోలాలతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

దీంతో ఇప్పుడు ఇది పెద్ద పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.దీనికి చూసేందుకు చాలామంది పర్యాటకులు క్యూ కడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube