ఏపీలో బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే.వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసిపోటీ చేయబోతున్నాట్లు కమలనాథులు ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.
అయితే పవన్ బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికి అది నామమాత్రమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ఎవరికివారే అన్నట్లుగా ముందుకు సాగుతున్నాయి.
బీజేపీ కార్యకలాపాలలో జనసేన ప్రస్తావన లేదు.అలాగే జనసేన కార్యక్రమాలలో బీజేపీ పాల్గొనింది లేదు.
దీంతో ఈ రెండు పార్టీల మద్య దోస్తీ ఎక్కువ రోజులు నిలవదనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఈసారి ఎన్నికలను పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలూ కూడా కమలనాథులకు అంతుచిక్కడం లేదు.
టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు చెబుతున్నప్పటికి పవన్ మాత్రం టీడీపీకి దగ్గరవుతుండడం కాషాయ పార్టీని కలవరపెట్టే అంశం.ఇదిలా ఉంచితే కాషాయ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలు కూడా జనసేన వైపే చూస్తున్నారు.
దీంతో మిత్రపక్షంగా ఉన్న పార్టీనే పక్కలో బల్లెంలా తయారైందని ఆందోళన కమలనాథుల్లో ఉందట.ఎందుకంటే ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన కన్నా లక్ష్మినారాయణ మొదట జనసేనలో చేరతారనే వార్తలు వినిపించాయి.
ఆ మద్య కన్నా లక్ష్మినారాయణ జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ లతో భేటీ కూడా అయ్యారు.

దీంతో కన్నా జేఎస్పీ తీర్థం తీసుకోవడం ఖాయమని భావించారంతా.అయితే అనూహ్యంగా ఆయన ఎవరు ఊహించని విధంగా టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.ఈ నెల 23న పసుపు కండువ కప్పుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చూసుకున్నారట.
దీంతో కన్నా లక్ష్మినారాయణ టీడీపీ వైపు చూడడానికి జనసేననే కారణం అనే వాదన మరోవైపు నుంచి వినిపిస్తోంది.ఎందుకంటే ఎన్నికల ముందు పవన్ కూడా టీడీపీతో పొత్తుకు సిద్దమయ్యే ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా ఉండడంతో అదే పార్టీలోని నేతలను జనసేన ఆహ్వానిస్తే.

మిత్రబంధం దెబ్బతినే అవకాశం ఉంది.దీంతో అన్నీ సమీకరణలను బెరుజు వేసుకొని కన్నా ను జనసేననే టీడీపీలోకి రిఫర్ చేసినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.దీంతో రాబోయే రోజుల్లో జనసేన టీడీపీతో కలిసీన లేదా సింగల్ గా బరిలోకి దిగిన నష్టపోయేది బీజేపీనే అని చెప్పొచ్చు.
ఎందుకంటే జనసేన అండతోనే ఏపీలో బలపడాలని చూస్తున్న కాషాయపార్టీ.పవన్ అనుసరిస్తున్న సైలెంట్ వ్యూహాలూ కమలనాథులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.మరి రాబోయే రోజుల్లో పవన్ వేసే ప్లాన్ లు బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.







