టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయంలో రాజకీయాల విషయంలో పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది.2024 లో వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అని పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాను కమిట్ అయిన సినిమాలను తొందరగా పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఇది ఇలా ఉంటే గత రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ఈ వారాహి వాహనాన్ని పరిచయం చేసినప్పటి నుంచి వైసిపి వారు ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వారాహి వాహనంపై నోటికి వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వారాహి వాహనం కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే వారాహి వాహనం రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించదట.
అలాగే వాహనం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.ఇదే విషయాన్ని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు స్వయంగా వెల్లడించారు.
వారాహి వాహనానికి రవాణాశాఖ చట్టం ప్రకారంగా అన్ని నిబంధలు ఉన్నాయని వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టం చేశారు.వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని అన్ని నిబంధనలు ఉన్నాయిని వాహనం రిజిస్ట్రేషన్ కు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని తెలిపారు పాపారావు.

పవన్ కళ్యాణ్ వాహనాన్ని చూసిన చాలా మంది వైసీపీ నాయకులు రాజకీయాలు వంటి సినిమాలు కాదు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అలాగే ఆర్మీ రంగులో ఉంది అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు.కాగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ప్రచారం చేయడం కోసం ఆ వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్న విషయం తెలిసిందే.ఆ విషయంపై కూడా కామెంట్స్ చేస్తూ ఇటువంటి రంగు వాహనంతో పవన్ కళ్యాణ్ సినిమాలలో మాదిరిగా ప్రచారాలు చేద్దామనుకుంటే కుదరదు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనాన్ని రిజస్ట్రేషన్ చేసింది.
వారాహి నంబర్ ను స్వయంగా కమిషనరే వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని తెలిపారు.వారాహి వాహనం రంగుపై వైసీపీ నేతల విమర్శలకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కావటంతో వైసీపీ ఇది కచ్చితంగా పెద్ద ఝలక్ అనే చెప్పాలి.