తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నటి మనోరమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈతరం ప్రేక్షకులకు ఈమె అంతగా తెలియక పోయినప్పటికీ ఆతరంపేక్షకులు మనోరమ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఈమె అప్పట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ నియమాలలో నటించి మెప్పించడం మాత్రమే కాకుండా అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.మనోరమ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆమె 1500 కు పైగా సినిమాల్లో నటించింది.
అంతేకాకుండా వెయ్యికి పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చి కొన్ని కోట్లాది మంది అభిమానుల మనసులలో స్థానం సంపాదించుకుంది మనోరమ.
కాగా మనోరమ తెలుగు, తమిళం,కన్నడం మలయాళం హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది.ఈమెను అభిమానులు ముద్దుగా ఆచి అని కూడా పిలిచేవారు.1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో తెరంగ్రేటం చేసింది మనోరమ.ఆ తర్వాత మళ్లీ కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయింది.
అంతే కాకుండా 1987 కాలంలో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించుకుంది.

ఇక అప్పట్లోనే మనోరమ అగ్ర హీరోలైన శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి నటించింది.కాగా మనోరమ చివరగా సింగం 2 సినిమాలో నటించింది.ఇది ఇలా ఉంటే తాజాగా మనోరమకి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో అవుతోంది.అదేమిటంటే.1996 ఎన్నికల సమయంలో రజినీకాంత్ ఒక పార్టీకి మద్దతు తెలిపినప్పుడు, మనోరమ మరొక పార్టీ తరపున ప్రచారం చేస్తూ రజనీకాంత్ ని కించపరిచే విధంగా మాట్లాడిందట.

దాంతో ఎన్నికల తర్వాత మనోరమకి సినిమాలలో అవకాశాలు రాలేదు.ఇక ఆ విషయం తెలుసుకున్న రజినీకాంత్ తనను కించపరిచిన విషయాన్ని కూడా మరిచిపోయి సొంతంగా తాను కలగజేసుకొని అరుణాచలం సినిమాలో ఆమెకు అవకాశాన్ని ఇప్పించి తనకు శత్రువులు ఎవరూ ఉండరు అని చెప్పారట రజనీకాంత్.అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ వార్తపై స్పందించిన రజనీకాంత్ అభిమానులు దేవుళ్ళకే శత్రువులను క్షమించే మంచి గుణం ఉంటుంది.అలాంటి గుణం ఉన్న రజినీకాంత్ కూడా దేవుడే అంటూ అభిమానులు రజనీకాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.