'ఉస్తాద్'పై అఫిషియల్ అప్డేట్.. రొమాంటిక్ సన్నివేశాలతో ఫస్ట్ షెడ్యూల్!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఉన్న రేంజ్, ఫాలోయింగ్ మరే హీరోకు లేదు అనే చెప్పాలి.

ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన లైనప్ ను వరుస క్రేజీ సినిమాలతో ఫిల్ చేసాడు.

మరి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ఒకటి.ఈ సినిమాను యంగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చింది.

ఇక ఇప్పుడు మరోసారి ఇదే కాంబో రిపీట్ కాబోతుంది.దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో షూట్ లో ఇటీవలే జాయిన్ అయ్యాడు.

Advertisement

ఏప్రిల్ 5 నుండి ఈ సినిమా రెగ్యురల్ షూట్ జరుగుతుంది.ఈ షూట్ పై తాజాగా దీనిపై అధికారిక క్లారిటీ ఇచ్చేసారు.

మొదటి షెడ్యూల్ గురించి మేకర్స్ తెలిపారు.

ఈ షెడ్యూల్ లో అయితే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో వెయ్యికి మందికి పైగానే జూనియర్ ఆర్టిస్టులతో చేశారట.ఈ స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిందట.అంతేకాదు పవన్, శ్రీలీల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారట.

అంతేకాదు ఈ షెడ్యూల్ లో ప్రముఖ నటులు పాల్గొన్నారని తెలిపారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో భారీ హైప్ పెరగడమే కాకుండా పవర్ స్టార్ మరోసారి ఖాకీ చొక్కా వేసినట్టు తెలుస్తుంది.మరి హరీష్ పవన్ కు మరో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.

తాజా వార్తలు