ఈనెల 14వ తారీకు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ జరగనున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ కార్యక్రమా ఏర్పాట్లు నాదేండ్ల మనోహర్(Nadendla Manohar) దగ్గరుండి చూసుకుంటున్నారు.ఇదిలావుండగా శనివారం సాయంత్రం హైదరాబాదు నుండి గన్నవరంకి ప్రత్యేక విమానంలో పవన్ రావటం జరిగింది.
వచ్చిన వెంటనే మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో బీసీ సదస్సు(BC Conference) లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలు అంతా ఐక్యమత్యంగా ఉంటే.
పాలించే పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేశారు.బీసీలలో సమైక్యత ఎందుకు ఉండటం లేదో.
లోపం ఎక్కడుందో తెలుసుకోవాలని సూచించారు.
ఇక ఇదే సదస్సులో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి ఎందుకు తొలగించారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీసీ కులాల తొలగింపు పై వైసీపీ, టీడీపీ పార్టీలు కూడా ప్రశ్నించాలని… బీఆర్ఎస్ పార్టీ వివరణ ఇవ్వాలని బీసీ సదస్సులో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అట్టడుగు వర్గాలకు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన తనలో ఉందని పవన్ స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా బీసీలకు కూడా ఉప ప్రణాళిక నిధులు ఉండాలని తెలిపారు.అంతేకాదు బీసీలకు మైనింగ్ లో ఆర్థికపరంగా వాటా కూడా ఉండాలని పవన్ సూచించారు.