పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి” ( OG Movie ).ఈ సినిమా ఎప్పుడో 50 శాతం షూట్ పూర్తి చేసుకుందని అఫిషియల్ గా ప్రకటించారు.
ఆ తర్వాత కూడా కొద్దీ శాతం షూటింగ్ పూర్తి చేసారు.అయితే ఇటీవల ఈ సినిమా షూట్ ను వాయిదా వేశారు.
అందుకు కారణం అందరికి తెలుసు.పవర్ స్టార్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం బిజీ బిజీగా రాజకీయాల్లో గడుపు తున్నారు.
దీంతో ఈయన సినిమాలన్నీ అటకెక్కాయి.అన్ని కూడా మధ్యలోనే ఆగిపోయాయి.
అలాగే ఓజి సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు.

అసలు ఈ డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ కూడా అవుతుందని ఫ్యాన్స్ భావించారు.అంత ఫాస్ట్ గా పూర్తి చేసిన కూడా పవన్ కారణంగా లాస్ట్ లో వాయిదా పడక తప్పలేదు.అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓజి నుండి అప్డేట్స్ ఇవ్వమని మేకర్స్ ను కోరుతూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ అఫిషియల్ గా ఒక అప్డేట్ ఇచ్చారు.ఫ్యాన్స్ ఎప్పుడు ఆకలిగానే ఉంటారు.వారికీ తాము ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ప్రస్తుతం ఎలాంటి షూటింగ్ చేయడం లేదు.అందుకే ఇప్పట్లో ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇచ్చే పరిస్థితి లేదు.
కాబట్టి సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎవ్వరు ఆశించవద్దు.అంటూ మేకర్స్ క్లారిటీగా చెప్పారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ ( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







