రోడ్లు బాగుచేయమంటే దాడులు చేస్తారా.. స్పీకర్ తమ్మినేని సీతారాంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

రోడ్లు బాగుచేయమంటే దాడులు చేస్తారా.స్పీకర్ తమ్మినేని సీతారాంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం.

రాష్ట్రంలోని రహదారుల అధ్వాన పరిస్థితిని ప్రజలు, ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపైన్ చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులపై దాడి చేయడం బాధాకరమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఆదివారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పోలీసులు సమక్షంలోనే వైసీపీ నాయకులు దాడులు చేస్తే.ఆవేదన కలుగుతుంది అన్నారు.

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతినిత్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పేడాడ రామ్మోహన్ రావు శాంతియుతంగా ఫ్లెక్సీ రూపంలో ఓ విన్నపం చేస్తే దాడి చేశారని తెలిపారన్నారు.పోలీసుల సమక్షంలో దాదాపు 20 మందికి పైగా అధికార పార్టీకి చెందిన వాళ్ళు దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దాడిలో రామ్మోన్ రావు తో పాటు ఏడుగురు జనసైనికులు గాయపడ్డారన్నారు.దాడి చేసిన వారిపై కేసులు పెట్టక పోగా, ప్రజా సమస్యలపై నిరసన తెలిపిన జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారని, గాయాలపాలైన వారిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడానికి పోలీసులు విముఖత చూపించారని పేర్కొన్నారు.

Advertisement

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య పరిష్కారం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పానని కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్డు పైకి వస్తునాని గుర్తు చేశారు.ఆ పరిస్థితి తీసుకు రావద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నానన్నారు.

రహదారులు.మృత్యద్వారాలు.

అవుతున్నాయని ప్రభుత్వం మేల్కొని తక్షణమే మరమ్మతులు చేయాలని నిరసన తెలుపుతుంటే పోలీసులు సాయంతో కేసులు పెట్టి దాడులు చేస్తే భయపడే వ్యక్తులు మాత్రం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.రోడ్ల మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడడం మాత్రమే అడుగుతున్నామని వివరించారు‌.

అంతే కానీ ప్రభుత్వ విధులకు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించలేదని తెలిపారు.ఈ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం తమ వాళ్లపై అక్రమ కేసులు, దాడులు చేయడం వంటివి ఆపేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అభ్యర్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు