కవాతు అసలు మర్మం ఇదేనా పవనూ...?

జనసేన పార్టీకి ఈరోజు నుంచీ ఒక లెక్క కవాతు తరువాత నుంచీ మరో లెక్క అంటున్నారు జనసేన వర్గాలు.

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని రాజకీయ పార్టీలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు జీవితాంతకాలం గుర్తుంచుకునేలా తమ సత్తా చాటి చెప్పడానికే ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలుస్తోంది.

ఈ విషయాన్నే జనసేన వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి.ఏపీలో రాజకీయాలని పీక్ స్టేజ్ కి తీసుకుని వెళ్ళడానికి జనసేన భారీ ఏర్పాట్లనే చేస్తోంది.

ఈ కవాతు ఎఫెక్ట్ తో రానున్న 48 గంటల్లో ఏపీలో కీలక మార్పులు కూడా ఉంటాయని అంచనాలు వేస్తున్నారు.

ఇదిలాఉంటే.ఇంతకాలం జనసేన ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఫోకస్ అయ్యేది గత కొన్ని నెలలుగా సొంత ఛానెల్ లో కనిపిస్తున్నా అదంతటి ఫేమస్ మీడియా కాదు కాబట్టి జనసేన కార్యక్రమాలు ప్రజలలో పెద్దగా కనిపించలేదు.కానీ అభిమానులే మీడియా భాద్యతని కూడా నెత్తిన పెట్టుకున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు ఈ కవాతు తో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోనున్నాయని తెలుస్తోంది.మూడు నెలల క్రిత్రం జగన్ గోదావరి వంతెనపై జరిపిన పాదయాత్ర ఎలా ఆకట్టుకుందో అంతకు మించి రెస్పాన్స్ తెచ్చేందుకు జనసేన భారీ వ్యుహాన్నే రచిస్తోంది.

దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవున సాగే ఈ కవాతుతో ఏపీ తెలుగుదేశం, వైసీపీలకి గట్టి జవాబు చెప్పడానికి సిద్దమయ్యింది.మరొక విషయమేమిటంటే ఈ కవాతు మధ్యలోనే ఇద్దరు ముగ్గురు కీలక నేతలు జనసేనుడి ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టుగా కూడా తెలుస్తోంది.

అయితే ఈ నేతలు చేరిక ఏ పార్టీకి షాక్ ఇస్తుందో మాత్రం తెలియడం లేదు.ఇక ఏపీలో పాలిటిక్స్ ఇప్పటికిపుడు చూసుకుంటే టీడీపీ, వైసీపీల మధ్యనే కేంద్రీక్త్రుతమై ఉంది.

దాన్ని బద్దలు కొట్టాలన్నా, మొగ్గు కనిపించాలన్న జనసేనకు కవాతు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.ఇప్పటికే జనసేన కవాతుకు సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు నేతలు మరింత ఉశ్చాహంగా ఉన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ కవాతుకి సీపీఐ, సీపీఎం నుంచీ కూడా మద్దతు కూడగట్టి ఎక్కువ శాతం ప్రజలు ఈ కవాతులో పాల్గొనేలా చేయాలనేది జనసేన వ్యూహంగా తెలుస్తోంది.కేవలం ఒక్క ఏపీ మాత్రమే కాదు యావత్ దేశం, ప్రపంచం మొత్తం ఈ కవాతు గురించి మాట్లాడుకోవాలని ప్లాన్ చేస్తోంది.నేషనల్ మీడియా కూడా ఈ కవాతుని కవర్ చేయడానికి సిద్దమయ్యినట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఏది ఏమైనా సరే ఈ కవాతు తో ఏపీలో మరొక అతిపెద్ద రాజకీయ పార్టీగా జనసేన అవతరించాలనేది పవన్ వ్యూహంగా కనపడుతోంది.మరి రేపటి కవాతు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎంతమందికి దడ పుట్టిస్తుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు