'వకీల్‌ సాబ్‌' మిడ్‌ నైట్‌ షోలపై క్లారిటీ ఇచ్చిన యూనిట్‌ సభ్యులు

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్‌ సాబ్‌ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని దిల్‌ రాజు నమ్మకంగా చెబుతున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినప్పటి నుండి కూడా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో మిడ్‌ నైట్‌ షో లు మరియు బెనిఫిట్‌ షో లను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.రెండు మూడు వేల రూపాయలు అయినా కూడా టికెట్‌ ను కొనుగోలు చేసి మిడ్‌ నైట్‌ షో లను చూడాలని ఆసక్తిగా జనాలు ఉన్నారు.

ఇలాంటి సమయంలో దిల్‌ రాజు మిడ్‌ నైట్‌ షో లపై ఆసక్తి చూపడం లేదంటూ సమాచారం అందుతోంది.మిడ్‌ నైట్‌ షో లు ప్రసారం చేసినట్లయితే బ్యాడ్‌ టాక్‌ స్పెడ్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

సోషల్‌ మీడియాలో కొందరు కావాలని బ్యాడ్‌ టాక్‌ ను స్పెడ్‌ చేయడం వల్ల మొత్తం నష్టం వాటిల్లే అవకాశం ఉంది.అందుకే బెనిఫిట్‌ షో లను మాత్రమే వేయాలని మిడ్‌ నైట్‌ షోలకు దూరంగా ఉండటం బెటర్‌ అనే నిర్ణయానికి దిల్‌ రాజు వచ్చాడంటూ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్‌ కేవలం రెగ్యులర్‌ షో లకు మాత్రమే చేస్తున్నారు.ఇంకా బెనిఫిట్‌ షో లకు సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌ రాలేదు.

ప్రస్తుతం ప్రభుత్వాల వద్ద విజ్ఞప్తి కోసం దిల్‌ రాజు లేటర్‌ పెట్టాడంటూ వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

వకీల్‌ సాబ్‌ సినిమా లో పవన్‌ లుక్‌ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ కు అభిమానులు పూనకాలు తెచ్చుకుంటున్నారు.థియేటర్‌ లో ఏ రేంజ్‌ లో అభిమానులు ఉంటారో చూడాలి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు