యంగ్ డైరెక్టర్ సుజిత్ (Director Sujeeth) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ప్రాజెక్ట్ అలా స్టార్ట్ చేసాడో లేదో ఈ సినిమాపై హైప్ భారీగా పెంచేందుకు వరుసగా ఏదొక అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు.వీరి కాంబోలో సినిమా అనౌన్స్ మెంట్ రాగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ ముందుగా షాక్ అయ్యారు.
అయితే ఈయన తీసిన సాహో సినిమా ప్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలో చూపించిన యాక్షన్ ప్రేక్షకులను బాగా మెప్పించింది.
అందుకే ఇంతే స్థాయి యాక్షన్ ఈ సినిమాలో కూడా ఉంటుంది అని ఫ్యాన్స్ ఆశ పడ్డారు.
అయితే వీరు అనుకున్నట్టుగానే ఈ సినిమాలో సుజిత్ పవర్ స్టార్ ను సాలిడ్ రోల్ లో మాస్ గా చూపించ బోతున్నట్టు అనిపిస్తుంది.ఇటీవలే రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తుంటే ఇదే అనిపించింది.
టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ”ఓజి” (OG Movie) అనే సినిమాను ఈ మధ్యనే ప్రకటించి గ్రాండ్ గా లాంచ్ కూడా చేసారు.

అయితే గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ముంబైలో షూట్ స్టార్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.ఈ చిన్న వీడియో లోనే యాక్షన్ గాని వైలెన్స్ గాని ఏ లెవల్లో ఉంటాయో సుజీత్ చిన్న శాంపిల్ చూపించాడు.పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జోయినా కానున్నాడు అనే విషయాన్నీ ఈ రోజు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

”మేక్ వే ఫర్ ది ఓజి” అంటూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది.మరి షూట్ స్టార్ట్ కావడానికి ముందు నుండే ఇంత హైప్ క్రియేట్ చేసుకుంటున్న ఈ సినిమా షూట్ మొత్తం అయిపోయి ఒక్కో అప్డేట్ వస్తుంటే ఇక ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి.ఇక ఈ సినిమాకు థమన్ (Thaman) సంగీతం అందిస్తుండగా.డివివి ఎంటెర్టైనమెంట్స్ వారు నిర్మిస్తున్నారు.







