ఏపీ “ఎంపీ” లని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ మరో మారు ఏపీ ఎంపీల పై విరుచుకు పడ్డారు.తమిళ నాడు నేతలకి వున్నా స్పూర్తి మీలో లేకపోవడం చాలా దారుణం వారిలో ఉన్న స్పూర్తి మీలో ఎందుకు లేదు అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.

 Pawan Kalyan Shocking Comments On Ap Mp’s-TeluguStop.com

అసలు పవన్ కళ్యాణ్ ట్వీట్ ఎందుకు చేశాడు.ఏంటి విషయం అనే విషయాన్ని పరిశీలిస్తే.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటేజేషన్ కు వ్యతరేకంగా ఏపి పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు…మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ సూచించటం సర్వాత్రా చర్చనీయంసం అయ్యింది…లాభాల్లో ఉన్న డిసిఐని ప్రైవేటీకరించటం సరికాదంటూ ఆమధ్య పవన్ విశాఖపట్నంలో హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే డిసిఐని ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకిస్తూ పవన్ ఓ సభ నిర్వహించటమే కాకుండా ప్రధానికి ఓ లేఖ కూడా రాశారు.

ఇప్పుడు అదే విషయం మీద ట్విట్టర్ లో స్పందించారు.నష్టాల్లో ఉన్న సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన పవన్.

నష్టాల్లో ఉన్న సంస్ధనే ప్రైవేటీకరించవద్దని ముఖ్యమంత్రి లేఖ రాసినపుడు లాభాల్లో ఉన్న మన ఏపీ డిసిఐని ప్రైవేటీకరించటంలో అర్ధం లేదన్నది పవన్ ట్విట్టర్ లో చాలా ఘాటుగా చెప్పారు.ఎంపీలు డిసిఐ విషయంపై వెంటనే ప్రధానిని కలిసి ఒప్పించాలంటూ పవన్ గట్టిగా కోరారు.

తమిళ నాడు రాష్ట్రం తమ ప్రయోజనాలని కాపాడుకునేందుకు….తమిళనాడు నేతలు అందరూ ఏకతాటిపై నిలబడినపుడు అదే స్పూర్తి ఏపి నేతల్లో ఎందుకు కొరవడిందని పవన్ ప్రశ్నించారు.

దీంతో ఎపీకి చెందిన ఎంపీలు పవన్ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నారు.మాకు అన్ని విషయాలు తెలుసు పవన్ కళ్యాణ్ చెప్తేనే మేము నడుచుకునే విధంగా లేము మా అధిష్టానం పవన్ కళ్యాణ్ కాదు అంటూ పంచ్ డైలాగులు చెప్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube