గుజరాత్ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్ లో ఉన్న బిజేపి అధిష్టానం.ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల పరిస్థతితులపై దృష్టి పెట్టింది.
ఇప్పుడ మోడీ జోష్ కి ఎలాంటి వారైనా సరే తలోగ్గల్సిందే అంటున్నారు బిజేపి నాయకులు.అయితే బిజేపి కి ఎంతో అనుకూలంగా ఉన్న కేంద్రమంత్రులని మోడీ సీఎం పోస్టులు ఇచ్చి పంపిస్తున్నాడు.
మోడీ మంత్రి వర్గంలో చేసిన వారు ముఖ్యమంత్రులు అవుతున్నారు.మనోహర్ పారికర్ అంతకుముందు గోవా సీఎంగా పనిచేయగా అక్కడి నుంచి కేంద్ర మంత్రి అయ్యారు.
అయితే మళ్ళీ గోవా ఎన్నికల నేపధ్యంలో పారికర్ ని మోడీ గోవా ముఖ్యమంత్రిగా పంపారు.
ఇదిలా ఉంటే శర్వానంద సోనోవాల్ను అస్సాం సీఎంగా పంపించారు…ఇప్పుడు మరొక కేంద్రమంత్రి జేపీ నడ్డాను…హిమాచల్ప్రదేశ్ సీయం గా చేయడానికి రంగం సిద్దం చేశారు.
అసలు నడ్డాకంటే ముందుగా…అక్కడ బీజేపీ సీఎం అభ్యర్థి అయిన మాజీ సీఎం ప్రేమ్ కుమార్ దుమాల్ అనుకున్నారు అయితే ఆయన అనూహ్యంగా ఓటమి పాలవడంతో.ఇప్పడు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను హిమాచల్ సీఎంగా పంపుతారని తెలుస్తోంది.
ప్రేమ కుమార్ కంటే ముందుగానే నడ్డాని సీయం అభ్యర్ధి అనుకున్నారు కానీ కొంతమంది అసమ్మతి కారణంగా బిజెపి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.ఇప్పుడు నడ్డానే సీయం అభ్యర్ధిగా ఖరారు చేసింది.
అయితే ఇప్పుడు కేంద్రక్యాబినెట్ నుంచీ మంత్రులు ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రులు అవ్వడంతో కేంద్ర మంత్రివర్గంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మంత్రి వర్గ విస్తరణ మళ్ళీ తెరమీదకి వచ్చింది….ఇప్పుడు ఒక మంత్రి పదవి కాళీ అవ్వడం ఎప్పటి నుంచో చేయాలనుకున్న విస్తరణకి కారణం అయ్యింది.
కేంద్రంలో మంత్రి పదవులు ఎప్పటి నుంచో ఆశిస్తున్న వారు ఉన్నారు.అంతేకాక రానున్న రాజకీయ పరిణామా నేపధ్యంలో అవసరాల కోసం ఈ ఖాళీలు భర్తీ అవుతున్నాయి అని తెలుస్తోంది…అయితే ఈ విస్తరణలో బిజేపి ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇవ్వనుంది అని తెలుస్తోంది.
క్యాబినెట్ విస్థరణలో భాగంగా కొంతమంది మంత్రులకి ఉద్వాసన కూడా ఉండటంతో ఆ లిస్టు లో ఏపీ మంత్రి పేరు కూడా ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
పోలవరం విషయంలో ఏపీ చేసిన తప్పులు.
కేంద్రం తప్పు బట్టి ప్రాజెక్ట్ పనులని ఆపమని చెప్పిన తరుణంలో చంద్రబాబు బిజెపి పై చేస్తున్న కుట్రల్ని నిశితంగా గమనిస్తూ వస్తున్న మోడీ.కేబినేట్ లో కత్తెర వేసి చంద్రబాబు ని కట్టడి చేయాలని చూస్తున్నట్టుగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు…బిజేపి ప్రభుత్వం బాబు ని లొంగ తీసుకునేందుకు ఇదొక ఎత్తుగడ.
ఒక వేళ ఇదే కనుకా నిజమైతే బాబు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి తలొగ్గారు అంటున్నారు టిడిపి నాయకులు.







