విశాఖ హార్బర్ లో బోటు నష్టపోయిన మత్స్యకారులకు 50 వేల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.
మత్స్యకారులలో ధైర్యం తెగింపు ఎక్కువ అని అన్నారు.విశాఖలో బోటు దగ్ధమైన సంఘటన జరిగిన సమయంలో తాను ఎంతగానో బాధపడినట్లు చెప్పుకొచ్చారు.
అయితే తాను ఇచ్చే డబ్బు మొత్తం కష్టం తీరుస్తుందని భావించడం లేదు.కానీ మీకు అండగా పవన్ కళ్యాణ్ ఉంటాడని మాత్రం చెబుతున్నాను.
కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన.నేడు 30 లక్షల రూపాయలు మత్స్యకారులకు ఇచ్చిన.
మొత్తం బాధ తీరుతుంది అని నేను చెప్పటం లేదు.మీ బాధలో తోడుగా ఉంటానని మాత్రం మాట ఇస్తున్నాను.
అయితే వైసీపీ( YCP ) ప్రభుత్వం వచ్చాక విశాఖ హార్బర్ లో గ్యాంగ్ లు ఎక్కువైపోయాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ ఆకతాయిలు మత్స్యకారులపై దాడులు ఆడవాళ్ళనీ వేధింపులకు గురి చేస్తున్నారు.
కొన్నిసార్లు మత్స్యకారుల దగ్గర నుండి డబ్బు కూడా దోచేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి పరిస్థితులు హార్బర్ లో ఎక్కువైపోయాయి అని పవన్ మండిపడ్డారు.
జనసేన ప్రభుత్వం వచ్చాక ఇలాంటి పరిస్థితులు లేకుండా భద్రత కల్పిస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.మరో నాలుగు నెలలలో ఈ ప్రభుత్వం వెళ్లిపోతుందని అంతవరకు ఓపికగా ఉండాలని సూచించారు.
మన ప్రభుత్వం వచ్చాక మెరైన్ పోలిసింగ్ ఏర్పాటు చేస్తామని లైట్లు కూడా పెడతామని స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరికి భద్రత కల్పించేలా జనసేన( Janasena ) ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాట ఇచ్చారు.







