టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh ) యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లాలో జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి భారీ ఎత్తున తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
నవశకం పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ మరి కొంతమంది నాయకులు రావడం జరిగింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాట్లాడుతూ.వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈ పొత్తు పెట్టుకోకపోతే ప్రజలందరూ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు.కూల్చివేతతో మొదలైన ఈ ప్రభుత్వం.
ప్రజలను అష్ట కష్టాలకి గురిచేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఆకాంక్షతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత దోపిడీకి గురవుతుందని వ్యాఖ్యానించారు.లోకేష్ ది మాటల పాదయాత్ర కాదు చేతలు చూపే పాదయాత్ర అని అభివర్ణించారు.ప్రజా సమస్యల వింటూ లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది.జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యింది.అక్రమ కేసులలో చంద్రబాబును జైల్లో పెట్టడం ఎంతో బాధించింది.వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే.2024లో జగన్ ను ఇంటికి పంపిస్తాం.జగన్( CM YS jagan ) తన పార్టీ ఎమ్మెల్యేలను మార్చుకుంటున్నారు.
మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.ముఖ్యమంత్రిని.
జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది.ముఖ్యంగా ఒంటరి మహిళలు.
అన్యాయాలకు గురవుతున్నారు.జగన్ కి ప్రజాస్వామ్యం విలువ తెలియదు.
ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగించడం జరిగింది.