టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే ఈయనకు ఏ మాత్రం విరామం సమయం దొరికిన ఎక్కువగా పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్లో గడపడానికి ఇష్టపడతారు.
అయితే ప్రతి ఏడాది వేసవి కాలంలో పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్లో పండిన మామిడి పండ్లను ఇండస్ట్రీకి చెందిన పలువురుకి పంపించడం చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మామిడి పండ్లను వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు పంపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ భార్య గాయత్రి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన పొలంలో పండిన మామిడి పండ్లను తమ కుటుంబానికి పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వేణు శ్రీరామ్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు పవన్ కళ్యాణ్ తోటలో పండిన మామిడి పండ్లను పంపినట్లు తెలుస్తోంది.ఇకపోతే రాజకీయాలలో ఎంతో బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.

ఈ క్రమంలోనే ఈయన రీ ఎంట్రీ ఇస్తూ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ-ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద ఎంతో మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం భీమ్లానాయక్ సినిమాతో మరొక హిట్ కొట్టారు.ప్రస్తుతం ఈయన హరహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.







