పవన్ కల్యాణ్ కెరీర్ లో రీమేక్ హిట్స్ ఇవే !

పవన్ కళ్యాణ్ ని ఈరోజు ఇండస్ట్రీలో మనం స్టార్ హీరోగా చూస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం ఆయన ఎక్కువగా రీమేక్ లను నమ్ముకోవడమే.

అత్యధిక రీమిక్స్ సినిమాల్లో నటించిన రికార్డు కూడా పవన్ కళ్యాణ్ కి సొంతం.

ఎక్కువ రీమేక్ సినిమాలను తెలుగులో తనదైన రీతిలో రూపొందించి ఈ బ్లాక్ వాసు హిట్స్ అందుకున్నాడు.తన మొదటి సినిమా మొదలు గత చిత్రం బీమ్ల నాయక్ వరకు చాలా సినిమాలు రీమేకులే కావడం గమనార్హం.

అలా పవన్ నటించి హిట్టు కొట్టిన ఆ రీమిక్స్ సినిమాలు ఏంటో చూద్దాం.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ తీసిన ఖయామత్ సే బయామత్ తక్ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు ఈవీవీ తెరకెక్కించగా ఇది యావరేజ్ సినిమాగా నిలిచింది.

గోకులంలో సీత

ఇక పవన్ రెండవ సినిమా గోకులంలో సీత కూడా రీమేక్ సినిమానే.తమిళ భాషలో హీరో కార్తీక్ నటించిన గోకులతిల్ సీతై అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

సుస్వాగతం

Advertisement

పవన్ కళ్యాణ్ నటించిన మూడవ సినిమా సైతం రీమేక్ చిత్రమే.తమిళ్లో హీరో విజయ్ తీసిన లవ్ టుడే అనే చిత్రాన్ని తెలుగులో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ రీమేక్ గా నటించగా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది.

తమ్ముడు

జీ జోతా నహీ సికందర్ అనే హిందీ సినిమా ని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తెరకెక్కించగా అదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు.

ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఖుషి

తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖుషి.దీన్ని తెలుగులో అదే పేరుతో సూర్య దర్శకత్వంలోనే రీమేక్ గా విడుదల చేయగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యద్భుతమైన సినిమాగా రికార్డ్ విజయాన్ని సాధించింది.

అన్నవరం, తీన్ మార్, గోపాల గోపాల

తమిళ సినిమా తిరుపాదిగా చిత్రాన్ని తెలుగులో అన్నవరం గా పవన్ కళ్యాణ్ రీమేక్ చేయగా ఇది యావరేజ్ సినిమాగా నిలిచింది.

ఇక సైఫ్ అలీఖాన్ లవ్ ఆజ్ కల్ అనే పేరుతో తీసిన చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ విడుదల తీన్ మార్ గా చేయగా అది ఫ్లాప్ అయింది.ఇక అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కలిసి నటించిన చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాల అనే పేరుతో వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలు గా విడుదల చేయగా ఈ చిత్రం కూడా యావరేజ్ సినిమాగా నిలిచింది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

గబ్బర్ సింగ్

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాని పవన్ కళ్యాణ్ తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా ఇది తెలుగు సినిమా రికార్డుల దుమ్ము దులిపింది.

కాటమ రాయుడు

తమిళంలో దీదం అనే పేరుతో అజిత్ హీరోగా విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు అనే పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రం పరాజయం పాలయింది.

Advertisement

వకీల్ సాబ్

బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన పింక్ అనే సినిమాని తెలుగులో వకీల్ సాబ్ అనే పేరుతో రీమెక్ చేయగా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

భీమ్లా నాయక్

మలయాళం లో అయ్యప్పయుం కోషియం అనే చిత్రాన్ని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరు తో పవన్ కళ్యాణ్ హీరో గా రీమేక్ చేయగా ఇది ఒక సూపర్ హిట్ సినిమా అయ్యింది.

తాజా వార్తలు