మెగా ఫ్యాన్స్‌ తల్చుకుంటే ఆ రికార్డు ఏమంత పెద్ద విషయం కాదు

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.ఇటీవల ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అడ్వాన్స్‌ హ్యాపీబర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్‌ను జాతీయ స్థాయిలో ట్రెండ్‌ చేశారు.

24 గంటల్లో 21 మిలియన్‌ల హ్యాష్‌ ట్యాగ్స్‌ పోస్ట్‌ చేశారు.ఇక ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్‌ను ఏకంగా 28 మిలియన్‌ ల ట్వీట్స్‌ చేశారు.

ఇది రికార్డుగా ఉంది.ఇక ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి బర్త్‌డే పై ఉంది.

వచ్చే నెలలో మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే ఉంది.ఆ సందర్బంగా సోషల్‌ మీడియాలో సందడి హంగామా అంతా ఇంతా ఉండకూడదని అంతా భావిస్తున్నారు.హ్యాపీ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్‌ను 24 గంటల్లో కనీసం 30 మిలియన్‌లు అయినా ట్వీట్స్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

అందుకు సంబంధించి ఇప్పటికే ప్రచారం షురూ చేశారు.మెగాస్టార్‌ స్టార్‌డం ఈ హ్యాష్‌ ట్యాగ్స్‌తో చూపించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య చిత్రం షూటింగ్‌ కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వడం లేదంటే ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.ఇదే సమయంలో చరణ్‌ ఈ చిత్రంలో నటిస్తున్నాడా లేదా అనేది కూడా వెళ్లడి చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మొత్తానికి మెగాస్టార్‌ బర్త్‌డేను ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా ప్లానింగ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు