పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటిస్తున్న మూడు సినిమా లు షూటింగ్ దశలో ఉన్నాయి.క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమా షూటింగ్ ప్రారంభించి దాదాపు రెండేళ్లు అవుతోంది.
ఆ సినిమా ఎప్పటికి పూర్తి అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఓజీ సినిమా( OG Movie ) షూటింగ్ ఆ మధ్య చాలా స్పీడ్ గా చేశారు.
కనుక సగానికి పైగా పూర్తి అయ్యి ఉంటుంది.అయితే ఎప్పుడు పూర్తి చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు.
ఇక హరీష్ శంకర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) కూడా ప్రారంభం అయింది.కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వలేదు.

దాంతో ఈ మూడు సినిమాల పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్స్ కి హాజరు అయ్యే పరిస్థితి లేదు అంటున్నారు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని( Janasena ) వచ్చే ఎన్నికల్లో బలంగా ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నాడు.ఇక ఎన్నికలకు వంద రోజులు కూడా లేదు.
ఇలాంటి సమయంలో సినిమా లు అంటే కచ్చితంగా జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు విమర్శించే అవకాశం ఉంది.

అందుకే పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి ఇప్పుడు హాజరు అవ్వడం లేదు.ఏపీ లో ఎన్నికలు( AP Elections ) పూర్తి అవ్వాలి.అక్కడి పరిస్థితులపై క్లారిటీ రావాలి.
అప్పుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల విషయమై స్పష్టత వస్తుందని అంటున్నారు.సినిమాలు మొదటు పెట్టినంత వరకు కచ్చితంగా పవన్ పూర్తి చేస్తానంటున్నాడు.
కానీ ఎన్నికల తర్వాతే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటే ఆ సినిమా ల పరిస్థితి ఏంటా అంటూ కొంత మంది ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు.