క్రిష్ ని గాలికి వదిలేసిన పవన్ కళ్యాణ్...కారణం ఏంటంటే..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pavan kalyan ) ఇటు సినిమాలు, అటు పాలిటిక్స్ అంటూ చాలా బిజీగా తిరుగుతున్నాడు.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు కమిట్ అయిన సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్లు గా తెలుస్తుంది.

ఇక ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు కానీ ఇంతలోకే ఎలక్షన్స్( Ap Elections)రావడంతో మరొక మూడు నెలల పాటు సినిమా షూటింగ్ ల బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఏపి ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.కాబట్టి తను ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఒక స్టార్ డైరెక్టర్ అయిన క్రిష్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సంవత్సరాల నుంచి నలిగిపోతున్నాడనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన హరి హర విరమల్లు( Hari Hara Veera Mallu ) అనే సినిమా స్టార్ట్ చేసి దాదాపు మూడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా బయటికి రావడం లేదు.ఇక ఇంతకుముందు ఈ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ అనేది బయటికి వచ్చినప్పటికీ అది మంచి రెస్పాన్స్ సంపాదించింది.

అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది.సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద హీరోగాని, ప్రొడ్యూసర్ గానీ ఎవరు స్పందించడం లేదు.ఇక ప్రస్తుతం క్రిష్( Director Krish ) కొంచెం డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే తన తోటి డైరెక్టర్లు అందరూ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే తను మాత్రం ఒక సినిమా దగ్గర లాక్ అయిపోవడం జరిగిందని బాధపడుతున్నట్టు గా తెలుస్తుంది.అలాగే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కంటే వెనుక స్టార్ట్ చేసిన చాలా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు కానీ హరీ హర విరమల్లు ని మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.

అలా ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు అయితే ఈ సినిమాని ప్రస్తుతం ఆపేసారా లేదంటే మళ్ళీ షూటింగ్ నడుస్తుందా అనే విషయం తెలియాలంటే సినిమా టీం ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.

తాజా వార్తలు